Home Crime Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

Hanumakonda : అత్తను గన్ తో కాల్చి చంపిన కానిస్టేబుల్‌..!

0
10
Big Breaking
Spread the love

హన్మకొండ జిల్లా గుండ్ల సింగారంలో ఘటన..!

Hanumakonda | కుటుంబ కలహాలతో క్షణికావేశానికి లోనైన ఓ కానిస్టేబుల్‌ అత్తను రివాల్వర్ తో కాల్చి చంపాడు. హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. మృతురాలిని కమలమ్మగా గుర్తించగా, నిందితుడిని ప్రసాద్ గా గుర్తించారు. రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రసాద్‌ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. డబ్బుల విషయంలో అత్తా అల్లుడి మధ్య వివాదం కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రసాద్‌ భార్యతో కలిసి ఇటీవల  Hanumakonda గుండ్ల సింగారం గ్రామానికి వచ్చాడు.
డబ్బుల విషయంలో మరోసారి ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ గన్ తో కాల్పులు జరిపినట్లు తెలిసింది. దీంతో కమలమ్మ అక్కడికక్కడే మృతిచెందింది. తర్వాత కాల్పులకు పాల్పడిన కానిస్టేబుల్ పై కుటుంబ సభ్యులు దాడి చేశారు. కానిస్టేబుల్‌ ప్రసాద్‌ తలకు తీవ్ర గాయాలకు కాగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. వెంటనే అతడిని వరంగల్‌ ఎంజీఎంకు తరలించగా.. ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here