
South Central Railway Updates | హైదరాబాద్, సికింద్రాబాద్(Hyderabad, Secunderabad) డివిజన్ల పరిధిలో నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) అధికారులు పేర్కొన్నారు. ప్రధానంగా సెప్టెంబర్ 1నుంచి 30 వరకు సికింద్రాబాద్-వరంగల్ మెమూ 07462) రైలు రద్దు చేశారు. అలాగే వరంగల్-హైదరాబాద్ మెము రైలు (07463), కాజీపేట-బల్లార్షా (17035) రైళ్లు రద్దయయ్యాయి.
ఇక సెప్టెంబర్ 2నుంచి అక్టోబర్ 1వరకు బల్లార్షా-కాజీపేట (17036), సెప్టెంబర్ 1నుంచి 30వరకు సిర్పూర్‌టౌన్-కరీంనగర్ ఎంఈఎంయూ (07766), కరీంనగర్-బోధన్ ఎంఈఎంయూ(Karimnagar-Bodhan MEMU)(07894), నవంబర్ 2నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు బోధన్-కరీంనగర్ మెము (07893), కరీంనగర్-సిర్పూర్ టౌన్ (07765) రద్దు అయ్యాయి. అలాగే నవంబర్1నుంచి 30 వరకు కాచిగూడ-నడికుడి(07791), నడికుడి-కాచిగూడ (07792) రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. సెప్టెంబర్1నుంచి 30వరకు హెచ్‌ఎస్. నాందేడ్-రాయిచూర్(17664) రైలును తాండూర్-రాయచూర్‌ల మధ్య, సెప్టెంబర్2 నుంచి అక్టోబర్ 1వరకు రాయిచూర్-పర్భని (17663) ఎక్స్ ప్రెస్ రైలును, రాయిచూర్-తాండూర్‌ల మధ్య పాక్షికంగా రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు.
న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్, ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.