Home Telangana Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం...

Raithu Bharosa : రైతులకు ప్ర‌భుత్వం గుడ్ న్యూస్.. రైతు భరోసా, పంట నష్ట పరిహారం నిధులు విడుదల

0
15
Rythu Bharosa
Spread the love

Raithu Bharosa : తెలంగాణ ప్ర‌భుత్వం  రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. రైతుభరోసా (రైతుబంధు) నిధులు సోమవారం విడుదల చేసింది. ఐదు ఎకరాలకు పైబడి ఆరెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డ‌బ్బుల‌ను జమ చేసింది. 39 లక్షల ఎకరాలకు రూ. 2000 కోట్ల నిధుల బకాయిలు ఉన్నట్లు గతంలో వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. సోమ‌వారం నుంచి ఈనెల 9వ తేదీ వరకు పూర్తిస్థాయిలో రైతు భరోసా ( Raithu Bharosa ) నిధులను విడుదల చేయాల‌ని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కాగా సోమ‌వారం సుమారు 4 లక్షల మంది రైతుల ఖాతాల్లో నిధులు క్రెడిట్ అయినట్లు తెలిసింది. రైతుభరోసా నిధులు బ్యాంకు ఖాతాల్లో పడుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. ఐదేకరాల్లోపు వ్యవసాయ భూమి ఉన్నవారికి ప్రభుత్వం పలు విడుత‌లుగా రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే..

మ‌రోవైపు పంట నష్టం నిధులు విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 15,814 ఎకరాల్లో పంట నష్టం సంభ‌వించ‌గా 15,246 మంది రైతులకు రూ. 15.81 కోట్ల నిధులను ప్ర‌భుత్వం విడుదల చేసింది ప్రభుత్వం. కాగా, రాష్ట్రంలో అత్యధికంగా కామారెడ్డిలో 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు తెలంగాణ‌ ప్రభుత్వం వెల్ల‌డించింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here