Home Telangana Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో...

Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో మార్పులు.. మ‌రో 7.5 కిలోమీట‌ర్లు పొడిగింపు

0
6
Old City Metro Corridor
Old City Metro Corridor
Spread the love

Old City Metro Corridor  | హైద‌రాబాద్ పాత‌బస్తీ మెట్రో లైన్ నిర్మాణంలో మ‌రిన్ని మార్పులు చేయ‌నున్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉండ‌గా తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 5.5 కి.మీ మేర నిర్మించాల్సిన ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో లైన్ ను మరో రెండు కిలోమీట‌ర్లు పొడిగిస్తూ కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేశారు.

మొత్తం 7.5 కి.మీ దూరంతో నిర్మించ‌నున్న‌ పాత బస్తీ మెట్రో కారిడార్‌ నిర్మాణానికి రూ.2300 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథ‌మికంగా అంచనా వేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రెండో దశలో చేపట్టనున్న మెట్రో లైన్ల‌లో పాతబ‌స్తీ మెట్రో, నాగోల్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రో మార్గాలకే ఎక్కువ‌ ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఓల్డ్‌ మెట్రో కారిడార్‌కు రూ.500 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ.100 కోట్లను కేటాయించిన విష‌యం తెలిసిందే.
ఈ రెండు కారిడార్లు ఇన్నర్‌ రింగ్ రోడ్‌పై చాంద్రాయణగుట్ట వద్ద క‌లుస్తున్నాయి. దీంతో అక్కడ ఇంటర్‌ఛేంజ్‌ మెట్రో స్టేషన్‌ను నిర్మించ‌నున్నారు. చాలా సంవత్స‌రాలుగా పెండింగులో ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో మార్గాన్ని ఇతర కారిడార్లతో లింక్‌ లేకుండా పూర్తి చేయాలని భావిస్తున్నారు. అందుకు త‌గిన‌ట్లుగా ఎంజీబీఎస్‌ -చాంద్రాయణగుట్ట మెట్రో మార్గాన్ని కారిడార్‌-4 గా నిర్ణయించి డీపీఆర్‌ను రూపొందించారు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ అందజేయ‌నున్నారు. ఇదిలా వుండ‌గా
Old City Metro Corridor  : ఓల్డ్ సిటీలో నిర్మించే 7.5 కి.మీ మెట్రో కారిడార్‌లో భారీ ఎత్తున ఆస్తులను సేకరించాల్సి వస్తోంది. ఈ మెట్రో మార్గంలో సుమారు 1100లకు పైగా ఆస్తులు ఉన్నాయని, వీరికి పరిహారాన్ని చెల్లించేందుకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో సగం ఆస్తుల సేకరణకే వెచ్చించాల్సి వ‌స్తుంది. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో మెట్రో మార్గాన్ని నిర్మించే రోడ్డు వెడ‌ల్పు చాలా తక్కువగా ఉంది. దీంతో ఆ మార్గాన్ని 60 నుంచి 80 అడుగుల మేర విస్తరించాలంటే ఆస్తులను ఎక్కువ‌గా సేకరించాల్సి ఉంటుంది.

ఈ మార్గంలో విద్యుత్‌ స్తంభాలు, తాగునీటి పైపు లైన్లు, డ్రైనేజీలు, కేబుళ్లను మరో చోటుకు మార్చాల్సి ఉంటుంది. ఇందుకు సుమారు రూ.200 కోట్లు అవుతుందని తెలుస్తోంది. అలాగే మతపరమైన కట్టడాలు సైతం 100కు పైగా ఉండటంతో వీటికి ఎలాంటి ఆటంకం కలకుండా నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకు ఎన్నో అడ్డంకుల‌ను అధిగమించాల్సి ఉంది. ఈ కారణాల దృష్ట్యా ఓల్డ్ సిటీ మెట్రో లైన్ నిర్మించాలంటే సుమారు మూడేండ్లు పడుతుందనే అధికారులు చెబుతున్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here