HDFC Credit Card | హెచ్ డిఎఫ్ సీ HDFC క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఈ కొత్త రూల్స్ వరించేలా బ్యాంక్ ప్రకటన చేసింది. ఐతే మారిన ఆ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.
హెచ్ డి ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై అదనపు రుసుము చేస్తున్నారు. అవేంటి అంటే.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్, యుటిలిటీ లపైన అదనపు రుసుము వీరు వేస్తున్నారు. రెంటల్ లావాదేవీలపై 1%.. యుటిలిటీల పేమెంట్స్ పై 50వేలు దాటితే 1% రుసుము ఎక్స్ ట్రా వేస్తున్నారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారాపెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేస్తే 15 వేలు మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
థర్డ్ పార్టీ పేమెంట్స్ కు క్రెడిట్ కార్డ్ వాడితే మోత మోగిపోద్ది..
HDFC Credit Card థర్డ్ పార్ట్ యాప్ ల ద్వారా ఫీజులు చేసినా సరే 1 పర్సెంట్ వసూళ్లు చేయనున్నారు. అంతర్జాతీయ లావాదేవీల పైన ఎక్కువగా 3.5% ఫీజు వసూళు చేయనున్నారు. క్రెడిట్ కార్డ్ బిల్ లేట్ పేమెంట్ చేస్తే ఫైన్ గా 100 రూపాయలు ఉండేది దాన్ని ఇప్పుడు 300 చేశారు.
మీ క్యాష్ బ్యాక్ లేదా రివార్డ్ పాయింట్లు రెడీం చేయాలనుకుంటే 50 రూపాయలు వసూళు చేయనున్నారు. ఇలా హెచ్ డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ దారులకు ఆగష్టు 1 నుంచి పెద్ద షాక్ ఇవ్వనుంది. మరి మీరు కూడా హె డీ ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ వాడుతుంటే ఈ మార్పులను గమనించి మీ పేమెంట్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..