Wednesday, March 26Welcome to Vandebhaarath

PM Kisan Yojana : ప్రధానమంత్రి కిసాన్ యోజన 18వ విడత డబ్బుల కోసం చూస్తున్నారా? ఇలా చెక్ చేసుకోండి..

Spread the love

PM Kisan Yojana | కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద 2 వేల రూపాయలు డబ్బులు ప్రతిసారి అకౌంట్ లో జమ అవుతాయి.ఈ పథకం కోసం ఇప్పటికే 17వ విడత డబ్బులను లబ్ధిదారులు అందుకున్నారు. పీఎం కిసాన్ యోజన 17వ విడత డబ్బులను ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూన్ 18న అందరి ఖాతాలో జమ చేశారు. ఇప్పుడు 18వ విడత విడుదల చేయాల్సిన 2 వేల గురించి అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

18వ విడత పీఎం కిసాన్ యోజన రూ.2,000 నగదు ఆగస్ట్  నెలలో రాఖీపౌర్ణమి పండుగ తర్వాత విడుదల చేయనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో  18వ విడత పీఎం కిసాన్ డబ్బుల కోసం మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పదు. పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ ను సులభంగానే మీ మొబైల్ ఫోన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

READ MORE  Raitu RunaMafi | తెలంగాణలో రెండో విడత రైతు రుణమాపీ ఎప్పుడంటే..

పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే..

  • ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  • తర్వాత నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ పీఎం కిసాన్ రిజిస్టర్ నంబర్ ఎంటర్ చేసి.. మీ మొబైల్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేయాలి.
  • ఆ తర్వత మీ పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుస్తుంది.

PM Kisan Yojana ఈకేవైసీ చేయడం ఎలానో చూడండి..

  • పీఎం కిసాన్ ఈకేవైప్సీ చేయడానికి మీరు మీ సేవా కేంద్రాల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంటి దగ్గరే ఉండి మొబైల్ ద్వారా ఈ కేవైసీ చేయొచ్చు.
  • పీ ఎం కిసాన్ యోజన ఈ కేవైసీ కోసం ముందు మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
  • తర్వాత ఈ కేవైసీ పైన క్లిక్ చేయాలి.
  • అక్కడ మీ ఆధార్ కార్డ్ నెంబ నమోదు చేసి, ఓటీపీ ద్వారా ఈ కేవైసీ చేసుకోవచ్చు. ఐతే ఆధార్ కార్డ్ ఫోన్ నంబర్ కి కచ్చితంగా లింక్ అయ్యి ఉండాలి.
  • పీఎం కిసాన్ యోజన కోసం రిజిస్టర్ ఎలా అవ్వాలంటే..
  • పీఎం కిసాన్ యోజన్ కోసం కొత్తగా రిజిస్టర్ అవ్వాలంటే
  • పీఎం కిసాన్ అధికారిక వెబ్ సైట్ లో వెళ్లి.. రిజిస్ట్రేషన్ ను క్లిక్ చేయాలి.
  • న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఫారం వస్తుంది.
  • ఆ ఫారం లో రూరల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లేదా అర్బన్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో ఒకటి ఎంపిక చేయాలి.
  • ఆ తర్వాత మీ ఆధార్క్ కార్డ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రాష్ట్రాన్ని సెలెక్ట్ చేసి క్యాప్చా ఇస్తే ఓటీపీ వెరిఫికేషన్ అవుతుంది. ఆ తర్వాత మీ బ్యాంక్ వివరాలు. పొలం వివరాలు ఇతర వివరాలు పూర్తి చేయాలి. ఆ తర్వాత పీమె కిసాన్ యోజన కి మీరు అర్హులైతే మీకు తర్వాత రిలీజ్ చేసే విడల ద్వారా నేరుగా మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడుతుంది.
READ MORE  Agricultural Projects | రైతుల‌కు గుడ్ న్యూస్.. 13,966 కోట్ల విలువైన ఏడు వ్యవసాయ ప్రాజెక్టులకు ఆమోదం

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *