Old City Metro Corridor | పాత బస్తీ మెట్రో లైన్ అలైన్ మెంట్ లో మార్పులు.. మరో 7.5 కిలోమీటర్లు పొడిగింపు
Old City Metro Corridor | హైదరాబాద్ పాతబస్తీ మెట్రో లైన్ నిర్మాణంలో మరిన్ని మార్పులు చేయనున్నారు. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్‌నుమా వరకు నిర్మించాల్సి ఉండగా తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు. ఇప్పటి వరకు 5.5 కి.మీ మేర నిర్మించాల్సిన ఉన్న ఓల్డ్ సిటీ మెట్రో లైన్ ను మరో రెండు కిలోమీటర్లు పొడిగిస్తూ కొత్త డీపీఆర్‌ను సిద్ధం చేశారు.మొత్తం 7.5 కి.మీ దూరంతో నిర్మించనున్న పాత బస్తీ మెట్రో కారిడార్ నిర్మాణానికి రూ.2300 కోట్ల వ్యయం అవుతుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో దశలో చేపట్టనున్న మెట్రో లైన్లలో పాతబస్తీ మెట్రో, నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు నిర్మించే మెట్రో మార్గాలకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లోనూ ఓల్డ్ మెట్రో కారిడార్‌కు...