Indian Institute of Cosmetology | హైదరాబాద్: నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎస్‌డిసి)కి అనుబంధంగా ఉన్న వెల్‌నెస్ అండ్ బ్యూటీ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ, ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ (I2CAN) హైదరాబాద్‌లో తన కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. డెర్మా ఆరా కాస్మెటిక్, లేజర్ క్లినిక్‌తో I2CAN వ్యూహాత్మక భాగస్వామ్యంతో హైదరాబాద్ కేంద్రాన్ని ప్రారంభించినట్లు సోమవారం ఒక ప్రకటలో తెలిపింది.
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కాస్మోటాలజీ (Indian Institute of Cosmetology ), ఈస్తటిక్స్ అండ్ న్యూట్రిషన్ అకడమిక్, సర్టిఫికేషన్ సేవలను అందించడంపై దృష్టి సారిస్తుందని, దక్షిణ భారతదేశంలోని విద్యార్థులకు ఈ రంగంలో ఉన్నత-నాణ్యత గల విద్యను మరింత చేరువ చేసేందుకు నిబద్ధతతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఇన్ స్టిట్యూట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ క్లినికల్ కాస్మోటాలజీ (PGDCC), అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ కాస్మోటాలజీ అండ్ ట్రైకాలజీ (ADCT), మైక్రోబ్లేడింగ్‌లో సర్టిఫికేషన్, మైక్రోపిగ్మెంటేషన్, BB గ్లో, ఈస్తటిక్ గైనకాలజీలో సర్టిఫికేట్ వంటి ఇన్-డిమాండ్ ప్రోగ్రామ్‌లతో సహా హైదరాబాద్ కేంద్రం అనేక కోర్సులను అందిస్తుంది.
I2CAN, మేనేజింగ్ డైరెక్టర్, MD నందన్ గిజారే మాట్లాడుతూ, “మా కొత్త కేంద్రం హైదరాబాద్‌లోని విద్యార్థులకు ఫ్యాషన్ రంగంలో ఉపాధి అవకాశాలను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 1, 2024న ప్రారంభమయ్యే మా మొదటి బ్యాచ్‌తో జూలై చివరి నాటికి కేంద్రాన్ని పూర్తి చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము”. అని పేర్కొన్నారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..