New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ

New pensions | ఇక వారి కూడా పింఛన్.. ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ
Spread the love

New pensions | తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు. పద్మశ్రీ అవార్డులు ప్రకటంచగానే శిల్పరామంలో ఘనంగా సత్కరించిన విషయం విదితమే! ఇటీవలే పద్మశ్రీ గ్రహీతలకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు నజరానా అందించగా, ప్రతి నెలా 25 వేల రూపాయలు పింఛను (Artistes Pension )కు సంబంధించి సోమ‌వారం జీవో విడుదల చేశారు. ఇక నుంచి ప్రతి నెల 25 వేల రూపాయల గౌరవ పెన్షన్ అందుతుందని సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్ల‌డించారు.

స‌మాజంలో కనుమరుగవుతున్న కళలను గుర్తించి, వాటిని భవిష్యత్తు తరాలకు అందించే క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించేందుకు ముఖ్య‌మంత్రి రేంవ‌త్ రెడ్డి సారథ్యంలోని ప్ర‌జా ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు అన్నారు. అందులో భాగంగా ఇటీవ‌లే ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని అందుకున్న గ‌డ్డం స‌మ్మ‌య్య‌, దాస‌రి కొండ‌ప్ప‌ తదితరులకు ప్ర‌తీ నెల25 వేల రూపాయల ప్ర‌త్యేక‌ పింఛ‌న్ (New pensions ) మంజూరు చేస్తూ జీవో జారీ చేసినట్లు వివరించారు. ఇక నుంచి సాంస్కృతిక శాఖ ద్వారా పింఛ‌న్ డ‌బ్బులు నేరుగా వారి ఖాతాల్లో జ‌మ అవుతాయని తెలిపారు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *