Bengaluru | బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించి గ్రేటర్ బెంగళూరు అథారిటీ (Greater Bengaluru Authority)గా రూపొందించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ కొత్త సంస్థ 5-10 కార్పొరేషన్లను కలుపుకొని 1400 చ.కి.మీ కంటే ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉండనుంది. GBAకి ముఖ్యమంత్రి అధ్యక్షత వహిస్తారు. రేపు అసెంబ్లీలో బిల్లు పెట్టనున్నారు. వివరాల్లోకి వెళితే..
గార్డెన్ సిటీగా పిలువబడే బెంగళూరును ఐదు జిల్లాలుగా విభజించే బిల్లుకు కర్ణాటక కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (జిబిఎ) ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ ప్రతిపాదనను బుధవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఏర్పాటుతో సుమారు 1400 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నగర ప్లాన్, ఆర్థికపరమైన నిర్వహణ బాధ్యతలను అధికారాలకు అప్పగించనున్నారు. GBA 950 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 1 నుండి 10 కార్పొరేషన్లను కలిగి ఉంటుంది. అయితే బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) కింద ఉన్న 708 చదరపు కిలోమీటర్లు పునర్నిర్మించనున్నారు. ముసాయిదా బిల్లు దాదాపు 400 వార్డుల ఏర్పాటును కూడా ప్రతిపాదించింది. ప్రతిపాదన ప్రకారం.. బెంగళూరు డెవలప్‌మెంట్ అథారిటీ (BDA) తన ప్రణాళికా అధికారాన్ని కోల్పోతుంది, అయితే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టడం కొనసాగిస్తుంది.
గ్రేటర్ బెంగళూరు అథారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. GBAలో 5 నుంచి 10 కార్పొరేషన్లు ఉంటాయి, ఒక్కొక్కటి కమీషనర్ పర్యవేక్షిస్తారు. వాటర్ బోర్డ్, BDA, BESCOM సహా వివిధ ఏజెన్సీలు గ్రేటర్ బెంగళూరు పరిధిలోకి వస్తాయి. బీబీఎంపీని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య విభాగాలుగా విభజించనున్నారు.
విస్తరించిన గ్రేటర్ బెంగళూరు నెలమంగళ, దేవనహళ్లి, హోస్కోటే, రామనగర, కనకపుర, అనేకల్ మరియు బెంగళూరు గ్రామీణ ప్రాంతాలను కవర్ చేస్తుంది. GBA కింద వివిధ స్థాయిలలో అధికార వికేంద్రీకరణకు మార్గం సుగమం చేస్తూ గ్రేటర్ బెంగళూరు గవర్నెన్స్ బిల్లు – 2024 క్యాబినెట్ ఆమోదం పొందింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..