ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలకమైన పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (APP)కి చెందిన రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్(Sanjay Singh) నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే సోదాలు నిర్వహించారు.
ఉదయం సంజయ్ సింగ్ ఇంటికి చేరుకున్న ఈడీ అధికారుల సోదాలు ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ ప్రభుత్వంలో మాజీ డిప్యూటీ సీఎంగా ఉన్న మనీష్ సిసోడియాను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీంతో అప్పటి నుంచి ఈ కేసు దే శవ్యాప్తంగా సంచలనంగా రేపింది. మద్యం పాలసీ కేసులో కేంద్ర ఏజెన్సీల నిఘాలో తాజా ఆప్ నాయకుడు సంజయ్ సింగ్ కూడా ఉన్నారు. ఢిల్లీ సర్కారు 2021 నాటి మద్యం పాలసీకి సంబంధించి ఎక్సైజ్ పాలసీ కేసు దాఖలు చేశారు. కానీ ఆ తర్వాత రద్దు చేశారు.
Delhi Liquor Policy Case లో ఏప్రిల్‌లో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను కూడా దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో మద్యం కంపెనీల ప్రమేయం ఉందని, దీని ఫలితంగా సంస్థలకు 12 శాతం లాభం చేకూరుతుందని సీబీఐ వాదిస్తోంది. ‘సౌత్ గ్రూప్’ గా పిలిచే ఒక మద్యం లాబీ దాని కోసం కిక్ బ్యాక్ చెల్లించిందని సీబీఐ ఆరోపించింది. 12 శాతం లాభంలో 6 శాతం మధ్యవర్తుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు మళ్లించబడిందని సీబీఐ పేర్కొంది. మరోవైపు కిక్ బ్యాక్‌ల లాండరింగ్ ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది. ఈ విధానాన్ని రద్దు చేసిన తరువాత అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం పాత మద్యం పాలసీని తీసుకొచ్చిందని బీజేపీ ఆరోపిస్తోంది. మరో వైపు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఏ తప్పు చేయలేదని ఆమ్ ఆద్మీ పార్టీ వాదిస్తోంది. మరోవైపు ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో, WhatsApp లోనూ సంప్రదించవచ్చు.