BJP Candidates First List : లోక్‌సభ ఎన్నికల బరిలో నిలవనున్న 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితాను శనివారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి వారణాసి నుంచే పోటీ చేయనున్నారు. ఇక కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ గాంధీ నగర్ నుంచి బరిలో నిలవనున్నారు.
గతంలో రాజ్య సభకు ఎన్నికైన ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ గుజరాత్‌లోని పోర్ బందర్ నుంచి బరిలో ఉంటున్నారు. ఢిల్లీ నుంచి ప్రవీణ్ ఖండేల్వాల్, మనోజ్ తివారీ, సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ పోటీ చేయనున్నారు. ఇక తొలి జాబితాలో 34 మంది కేంద్ర మంత్రులకు చాన్స్ లభించగా 28 మంది మహిళలకు అవకాశం దక్కింది.
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులకు అవకాశమిచ్చారు. 57 మంది ఓబీసీలకు తొలి జాబితాలో స్ధానం కల్పించగా, కీలకమైన యూపీ నుంచి 51 మంది అభ్యర్ధులను మొదటి జాబితాలో ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ నుంచి 20 మంది, ఢిల్లీ నుంచి ఐదుగురి పేర్లను తొలి జాబితాలో ప్రకటించారు. ఇక తెలంగాణ నుంచి 9 మంది ఎంపీ అభ్యర్ధులకు తొలి జాబితాలో అవకాశం దక్కింది.
BJP Candidates First List బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితాలో 28 మంది మహిళలు, 47 మంది యువకులు, 18 గిరిజన తెగల అభ్యర్థులు ఉన్నారు. మధ్యప్రదేశ్ నుంచి 24 స్థానాలు, గుజరాత్ నుంచి 15 స్థానాలు, రాజస్థాన్-15, కేరళ -12, తెలంగాణ -9 మంది, ఢిల్లీ-5, జమ్మూ-2, ఉత్తరాఖండ్- 2, గోవా -1, త్రిపుర -1, అండమాన్ 1 స్థానానికి అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. ఎన్డీయే కూటమికి 400 సీట్ల లక్ష్యంగా బీజేపీ ముందుకు సాగుతోందని బీజేపీకి 370కి పైగా సీట్లు వస్తాయని ఈ సందర్భంగా తావడే, అర్జున్ పాండే తెలిపారు.
తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా
Telangana BJP Candidates List తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, బీజేపీ మొదటి జాబితాలో 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. సిట్టింగ్ ఎంపీలను మరోసారి అదేస్థానం నుంచి పోటీలో నిలిపింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ కు మరోసారి ఛాన్స్ ఇచ్చింది.
- కరీంనగర్ – బండి సంజయ్
- నిజామాబాద్ – ధర్మపురి అరవింద్
- జహీరాబాద్ – బీబీ పాటిల్
- మల్కాజ్ గిరి ఈటల రాజేందర్
- సికింద్రాబాద్ – కిషన్ రెడ్డి
- భువనగిరి – బూర నర్సయ్య గౌడ్
- హైదరాబాద్ – మాధవీలత
- చేవెళ్ల – కొండా విశ్వేశ్వర్ రెడ్డి
- నాగర్ కర్నూల్ – భరత్ (ఎస్సీ)
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..