Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 3 ఆదివారం నుంచి మార్చి 9 శనివారం వరకు వారం రోజుల్లో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు
మేషరాశి
మేష రాశి వారికి ఈ వారంలో మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరవుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. Printing Press వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. చిన్ననాటి స్నేహితులతో కాలాన్ని గడుపుతారు. అన్ని విధాలా అదృష్టం తోడవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. శరీరము బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయం సాధిస్తారు. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృషభ రాశి
ఈ రాశి వారికి ఈ వారంలో అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. వ్యాపార భాగస్వామితో బంధం బలపడుతుంది. పాత బాకీలు వసూలు అవ్వడం ఆలస్యం అవుతాయి. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. Software ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండను. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి సానుకూలము. Eye sight పెరుగుతుంది. అలంకారానికి సంబంధించిన వస్తువుల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. జమానతు సంతకాలు పెట్టకూడదు. ఎట్టి పరిస్థితులను అసత్యం ఆడకూడదు. మీ తెలివితేటలతో వ్యాపారాన్ని విస్తరించ గలుగుతారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ వారంలో Banking sector ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండను. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహం నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మంచి నిద్ర ఉండదు. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలుగుతాయి. తండ్రికి అనారోగ్య సమస్యల నుండి కొంత ఉపశమనం ఉంటుంది. సంతాన ప్రయత్నం చేసే వారికి శుభవార్త వింటారు. సోదరులతో తగాదాలకు దూరంగా ఉండాలి. అసంతృప్తి భోజనం ఉంటుంది. Mediacl shop వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. ధనపరమైన వేసులుబాటు ఉంటుంది. కండరాలు మరియు ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. విద్యార్థులకు అనుకూలమైన సమయం. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారంలో అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది. మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు.విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కలవు. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. Real Estate వ్యాపారస్తులకు గవర్నమెంట్ నుంచి నోటీసులు అందుతాయి. వడ్డీ వ్యాపారస్తులకు నష్టములు కలిగే అవకాశాలు కలవు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారంలో తండ్రికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు చేసే అవకాశాలు కలవు. సంతాన ఏదుగురుదలని చూసి ఆనందిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తగ్గ ముఖం పడతాయి. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉండును. పాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండాలి. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారంలో మొండితనంతో కావాల్సింది సాధించుకుంటారు. తల్లితండ్రులకు అనారోగ్య సమస్యలు తప్పవు. చిన్నచిన్న అవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తుంది. కోపం, ఆవేశం అదుపులో పెట్టుకోవడం మంచిది. శరీరానికి గాయాలయ్యే అవకాశముంది. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జమానతు సంతకాలు, మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు సానుకూలిస్తాయి. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం వారికి గడ్డు కాలం. సెంటిమెంట్ వస్తువులు చేజార్చుకుంటారు. చర్మ సంబంధ వ్యాధులతో ఇబ్బంది పడతారు. ఫైనాన్స్ వ్యాపార రంగంలో ఉన్న వారికి భాగస్వాముల మధ్య అభిప్రాయ భేదములు రావొచ్చు. అసాధ్యము అనుకున్న కొన్ని పనులు తేలిగ్గా పూర్తవుతాయి. గణపతి ఆరాధన చెప్పదగిన సూచన.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో శ్రమకు తగిన గుర్తింపు సభా గౌరవం దొరుకుతుంది. నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాన్ని సాధిస్తారు. విదేశీ యాన ప్రయత్నాలు సానుకూలం. శుభకార్యాలను వాయిదా వేసుకుంటారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పోలీస్ శాఖ వారికి స్థాన చలనము కలదు. ఖర్చులు పెరిగిన డబ్బుకు ఇబ్బంది ఉండదు. నూతన దంపతుల మధ్య అభిప్రాయ భేదములు తలెత్తును. ఉపాధ్యాయులకు పనిభారం తప్పదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాయామము మరియు యోగా పట్ల శ్రద్ధ ఆసక్తి చూపుతారు. Hair Fall ఒక సమస్యగా మారుతుంది. ఈశ్వరుడికి మజ్జిగతో అభిషేకం చేయడం చెప్పదగిన సూచన.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో విద్య వృత్తి విషయాల యందు అభివృద్ధి ఉన్నప్పటికీ కొంత మానసికపరమైన వత్తిడి మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు తప్పవు. పోలీస్ , రక్షణ శాఖ మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులకు పదోన్నతి లభిస్తుంది. స్త్రీలకు వంట చేసేటప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు. చర్మ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు అనే విషయాన్ని గ్రహిస్తారు.రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత అపకీర్తి పొందినప్పటికీ ప్రజాదరణకు లోటు ఉండదు. విద్యార్థులు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేరు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. బంగారము మరియు బట్టల వ్యాపారస్తులకు Income Tax నోటీసులు అందుకునే అవకాశం కలదు. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న భూములకు సంబంధించిన గవర్నమెంట్ పర్మిషన్స్ మంజూరు అవుతాయి. మన్యుసూక్త హోమము చేసుకోవడం చెప్పదగిన సూచన.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ వారంలో అగ్ని సంబంధిత వస్తువులతో జాగ్రత్తగా ఉండాలి. గృహ నిర్మాణ పనులు వాయిదా పడతాయి. Textile మరియు Rice వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. దైవానుగ్రహం ఉంటుంది. సంతాన విద్యాభ్యాసానికై అధిక ధన వ్యయం చేస్తారు. నూతన విద్యను అభ్యసించే వారికి కొంత ఇబ్బందులు ఉండును. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి దూరప్రాంత ప్రయాణములు చేయవలసి వస్తుంది. కుల వృత్తిలో ఉన్నవారికి సభా గౌరవం దొరుకుతుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి విషయంలో ఇబ్బందులు ఉండును. ఇతరుల విషయాలలో తల దూచకూడదు. వాత సంబంధిత అనారోగ్య సమస్యలు ఉండను. దూర ప్రాంత ప్రయాణములు చేయకూడదు. దుర్గా అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారంలో అన్నింటా లాభం చేకూరుతుంది. విద్యార్థులు అధికమైన సత్ఫలితాలను పొందగలుగుతారు. Software మరియు రెవెన్యూ డివిజన్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. తండ్రికి అనారోగ్య సూచన. Hotel & Chit Fund వ్యాపారస్తులకు వ్యాపార భాగ్యస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అప్పు కొంత తీర్చగలుగుతారు. నూతన వ్యక్తుల పరిచయం వ్యాపార ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. గర్భిణీ స్త్రీలు తగిన ఆరోగ్య జాగ్రత్తలు పాటించవలసినదిగా చెప్పదగిన సూచన. కుటుంబ సభ్యులతో ఓర్పుగా మెలగాలి. చెడు ఆలోచనలకు అలవాట్లకు దూరంగా ఉండండి. ఒక శుభవార్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అధికమైన ఖర్చులకు దూరంగా ఉండండి. కుటుంబ పరమైన సౌఖ్యము ఉంటుంది. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారంలో స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి అధికారుల ఆగ్రహానికి గురవుతారు. బంధుమిత్రులతో కలిసి విందు భోజనం చేస్తారు. స్త్రీల కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. జీవిత భాగస్వామితో శాంతంగా వ్యవహరించాలి. Paints & Hardware వ్యాపారస్తులకు నష్టాలు కలుగును. భూ తగాదాలు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. Rice Mill & Cotton Mill వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ప్రతి విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. మీ దగ్గర పని చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి. సూర్య నమస్కారాలు చేయడం చెప్పదగిన సూచన.
మీన రాశి
Weekly Horoscope మీన రాశి వారికి ఈ వారంలో కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. జీవిత భాగస్వామికి కడుపుకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వారం చివరలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రజల సహకారం లభిస్తుంది. కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. చెడు వ్యసనాలకు ఆకర్షితులు అయ్యే అవకాశాలు కలవు. అప్పు కొంత తీర్చగలుగుతారు. వ్యాపార భాగస్వామి చేసిన మోసాన్ని పసిగడతారు. శరీరం తొందరగా అలసిపోతుంది. తండ్రితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారం తాకట్టు పెట్టవలసిన పరిస్థితి వస్తుంది. బంగారం మరియు వెండి వ్యాపారస్తులకు యోగ కాలము. చర్మవ్యాధులతో ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెప్పదగిన సూచన.
Weekly Horoscope By
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ