Home Telangana New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు...

New Ration Cards | కొత్త రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం త్వరలో దరఖాస్తులకు ఆహ్వానం!

0
4
Ration Card Application
New Ration Cards
Spread the love

New Ration Cards | హైదరాబాద్: కొత్త రేషన్ కార్డుల కోసం తాజాగా దరఖాస్తులను ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. కొత్త రేషన్‌కార్డులు, కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల కోసం వేర్వేరుగా దరఖాస్తులు చేసుకోవాలని, ఇక నుంచి విడివిడిగా మంజూరు చేస్తామని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం శాసనమండలిలో ప్రకటించారు. కౌన్సిల్‌లో అడిగిన ఒక‌ ప్రశ్నకు సమాధానమిస్తూ, దారిద్య్రరేఖకు దిగువన ఉన్న (బీపీఎల్) కుటుంబాలకు ప్రత్యేకంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలు ఇప్పటికీ క్యాబినెట్ సబ్‌కమిటీ పరిశీలనలో ఉన్నాయని వెల్ల‌డించారు.

“మేము కొత్త‌ రేషన్ కార్డుల జారీకి సంబంధించి మార్గదర్శకాలను రెండు వారాల్లో ఖరారు చేస్తాం. రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు ఇతర నిత్యావసర సరుకులను సరఫరా చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. కొత్త రేషన్ కార్డులకు అర్హత ప్రమాణాలను క్యాబినెట్ సబ్‌కమిటీ సిఫార్సుల ఆధారంగా ఉంటాయి, ”అని ఆయన చెప్పారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీల సూచనలపై మంత్రి స్పందిస్తూ, కొత్త రేషన్ కార్డులు (New Ration Cards) జారీ చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తుదారుల ఆదాయం, భూమి, ఇతర అంశాలను సమీక్షిస్తుందని చెప్పారు. కొత్తవి ఇచ్చే వరకు పాత రేషన్‌కార్డులు చెల్లుబాటు అవుతాయని మంత్రి హామీ ఇచ్చారు. కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు ఫార్మాట్ ఖరారు చేస్తామ‌ని, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామ‌ని తెలిపారు.

గ‌తంలో ప్రజాపాలన కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులను స్వీకరించిందని, కానీ ఇప్ప‌టికీ కూడా జారీ చేయలేద‌ని బిఆర్ ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణి దేవి ఆరోపించారు. రేష‌న్‌ కార్డుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆమె కోరారు. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందిస్తూ రేషన్ కార్డుల జారీలో జాప్యం వల్ల ఎవరికీ ఇబ్బందులు కలగడం లేదని, ఏమైనా సమస్యలుంటే తగిన విధంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ హయాంలో కొత్త రేషన్‌కార్డులేవీ ఇవ్వలేదని అన్నారు.


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here