Union Budget 2024 | కేంద్ర బడ్జెట్‌లో ఎక్కువ మొత్తాన్ని భారతీయ రైల్వేలను అప్‌గ్రేడ్ చేయడానికి కేటాయించామని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. విలేకరుల సమావేశంలో రైల్వే మంత్రి మాట్లాడుతూ.. రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, ప్రయాణికులకు భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన రైల్వే బడ్జెట్ 2024 గురించి వివరించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి వివిధ రాష్ట్రాలకు నిధుల కేటాయింపును వెల్లడిచారు. వందే మెట్రో, వందే భారత్ స్లీపర్ వెర్షన్ గురించి కూడా వివరాలను పంచుకున్నారు.
రాష్ట్రాల వారీగా రైల్వే కేటాయింపులు
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ కు రైల్వే మౌలిక వసతుల అభివృద్ధికి ఊతమిచ్చేందుకు ₹ 9,151 కోట్లు కేటాయించారు. అలాగే తెలంగాణకు రూ.5333 కోట్లు జమ్మూ, కాశ్మీర్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను పెంచడానికి ₹ 3,694 కోట్లు, ఉత్తరాఖండ్‌లో ₹ 5,131 కోట్లు, ఉత్తరప్రదేశ్‌లో ₹ 19,848 కోట్లు, హిమాచల్ ప్రదేశ్‌లో ₹ 2,698 కోట్లు, దిల్లీలో ₹ 2,582 కోట్లు, రాజస్థాన్‌లో 9,959 కోట్లు, ఈశాన్య ప్రాంతంలో ₹10,376 కోట్లు, ఒడిషా కోసం ₹10,586 కోట్లను కేటాయించారు. అదనంగా
కుంభమేళా 2025: రూ. 837 కోట్లు
భారతీయ రైల్వేలు రాబోయే కుంభమేళా 2025 కోసం తన సన్నాహాలను ప్రారంభించినందున, వివిధ మౌలిక సదుపాయాల పనుల కోసం రూ.837 కోట్లను కేటాయించింది. దీనిపై కేంద్ర రైల్వే మంత్రి మాట్లాడుతూ, కుంభమేళా కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి. 40కి పైగా ప్రాజెక్టులలో పనులు కొనసాగుతున్నాయి. మూడేళ్ల క్రితమే కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ప్రయాగ్‌రాజ్ స్టేషన్‌ను తిరిగి అభివృద్ధి చేశామని తెలిపారు.
10,000 ఇంజన్లలో కవాచ్ ఇన్ స్టాలేషన్
భారతదేశంలో రైలు ప్రమాదాలను నివారించేందుకు కవాచ్ 0.4 ఏర్పాటు గురించి మంత్రి వైష్ణవ్ వివరాలు వెల్లడించారు. అధునాతన భద్రతా వ్యవస్థ అయిన కవాచ్ 0.4 ఫైనల్ వెర్షన్‌ను భారతదేశం అంతటా 10,000 ఇంజన్లలో అమర్చనున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇటీవలి నెలల్లో రైల్వే ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కవచ్ కు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు.. యుపిఎ హయాం నుంచి ప్రమాదాలు 60% తగ్గాయి. భద్రత కేటాయింపులు పెరిగాయి. ప్రతి ప్రాణం విలువైనది. ఇది మానవతా సమస్య, రాజకీయ సమస్య కాదని మంత్రి పేర్కొన్నారు.
ఆహార పరిశుభ్రత పర్యవేక్షణకు AI వ్యవస్థ
భారతీయ రైల్వేలలో ఉన్న ఆహార పరిశుభ్రతకు సంబంధించిన ఒక ప్రధాన ఆందోళనను కూడా మంత్రి అశ్వని వైష్ణవ్ ప్రస్తావించారు. కొత్తగా 100 పెద్ద కిచెన్‌లను నిర్మిస్తున్నామని, ప్యాంట్రీ కార్లను డీప్ క్లీనింగ్ చేస్తున్నామని, ఆహార పరిశుభ్రతను పర్యవేక్షించేందుకు ఏఐ సిస్టమ్‌ను అభివృద్ధి చేశామని ఆయన వెల్లడించారు.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..