AP Cabinet | ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులకు శాఖలను కేటాయిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు నాయుడు వద్ద సాధారణ పరిపాలన శాఖలతో పాటు శాంతి భద్రతలు తన వద్దే ఉంచుకున్నారు. హోం అఫైర్స్, విపత్తు శాఖను వంగలపూడి అనితకు కేటాయించారు. శుక్రవారం మధ్యహ్నం 02:15 గంటల ప్రాంతంలో ఎవరికి ఏ శాఖ అనేది సీఎం చంద్రబాబు నాయుడు కేటాయింపులు చేశారు.
AP Cabinet శాఖల కేటాయింపు ఇలా..
- చంద్రబాబు ( ముఖ్యమంత్రి ) – సాధారణ పరిపాలన, శాంతి భద్రతలు
- పవన్ కల్యాణ్( ఉప ముఖ్యమంత్రి) – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, తాగునీటి సరఫరా, పర్యావరణ, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ
- నారా లోకేశ్ – మానవ వనరులు, ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఆర్టీజీ
- కింజారపు అచ్చెన్నాయుడు – వ్యవసాయం, పశుసంవర్ధక శాఖ, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్యశాఖ
- అనిత వంగలపూడి – హోం శాఖ, విపత్తు
- కొల్లు రవీంద్ర – గనులు, ఎక్సైజ్ శాఖలు
- నాదెండ్ల మనోహర్ – పౌర సరఫరాలు
- పొంగూరు నారాయణ – మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి
- సత్య కుమార్ యాదవ్ – ఆరోగ్యం, కుటుంబ వైద్యారోగ్య శాఖ
- నిమ్మల రామానాయుడు – వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్
- మహ్మద్ ఫరూఖ్ – లా అండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్
- ఆనం రాంనారాయణ రెడ్డి – దేవాదాయ శాఖ
- పయ్యావుల కేశవ్ – ఆర్థిక శాఖ, కమర్షియల్ ట్యాక్సెస్, లెజిస్లేటివ్
- వీరాంజనేయ స్వామి – సోషల్ వెల్ఫేర్
- అనగాని సత్యప్రసాద్ – రెవెన్యూ
- మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి – రవాణా, యూత్ అండ్ స్పోర్ట్స్
- కొలుసు పార్థసారథి – హౌసింగ్, ఐ అండ్ పీఆర్
- గొట్టిపాటి రవికుమార్ – ఎనర్జీ
- కందుల దుర్గేశ్ – టూరిజం, కల్చర్, సినిమాటోగ్రఫీ
- గుమ్మడి సంధ్యారాణి – మహిళా – శిశు సంక్షేమ అభివృద్ది శాఖ, ట్రైబల్ వెల్ఫేర్
- బీసీ జనార్థన్ రెడ్డి – రోడ్లు, భవనాలు
- టీజీ భరత్ – పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్
- ఎస్ సవిత – బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్ అండ్ టెక్స్ టైల్స్
- వాసంశెట్టి సుభాష్ – కార్మిక శాఖ
- కొండపల్లి శ్రీనివాస్ – ఎంఎస్ఎంఈ, సెర్ప్
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..