Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే, ఆమె రాకను వ్యతిరేకిస్తూ.. గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌ను ‘ముస్లిం’కి కేటాయించడాన్ని వ్యతిరేకించారు.
2020లో నివాసితులు తన కేటాయింపును చెల్లదని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) లేఖ రాయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయని సదరు మహిళ మీడియాతో అన్నారు. అయితే, ఆ సమయంలో పోలీసులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసి అక్కడితోనే వదిలేశారు. అయితే తాజాగా జూన్ 10 నుంచి మళ్లీ నిరసనలు ప్రారంభమయ్యాయి. 33 మంది సంతకాలతో జిల్లా కలెక్టర్, మేయర్, వడోదర మునిసిపల్ కార్పొరేషన్ (VMC) కమీషనర్ వడోదర పోలీస్ కమీషనర్‌లకు మళ్లీ ఫిర్యాదు చేశారు. ముస్లిం మహిళకు కేటాయించిన ఫ్లాట్ ను రద్దు చేయాలని Vadodara society నివాసితులు లేఖలో డిమాండ్ చేశారు.
“VMC మార్చి 2019లో ఒక మైనారిటీ లబ్ధిదారుకి K204 ఇంటి నంబర్‌ను కేటాయించింది… హర్ని ప్రాంతం హిందూ ప్రాబల్యం ఉన్న శాంతియుత ప్రాంతం అని, దాదాపు నాలుగు కిలోమీటర్ల సరిహద్దులో ముస్లింల నివాసం లేదని, కానీ ఇపుడు ముస్లింలకు కేటాయించడం సరికాదని నిరసనకారులు తెలిపారు. ఇతర మతస్తులనే ఆలోచన నివాసితులలో ఆందోళనను రేకెత్తించిందని సదరు మహిళ ఇంటి పొరుగువారు చెప్పారు. ప్రస్తుతం నగరంలోని మరొక ప్రాంతంలో తన కొడుకుతో నివసిస్తున్న ముస్లిం మహిళ, అపార్ట్ మెంట్ లోని యజమానుల వ్యతిరేకత కారణంగా తన “కష్టపడి సంపాదించిన ఆస్తి”ని విక్రయించడానికి ఇష్టపడడం లేదని చెప్పింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..