
Vadodara society | ప్రభుత్వ పథకం కింద ముస్లిం మహిళకు ఫ్లాట్‌ను కేటాయించినందుకు వడోదర సొసైటీ సభ్యులు నిరసన
Vadodara society members protest| ముఖ్యమంత్రి ఆవాస్ యోజన కింద ముస్లిం మహిళకు ఫ్లాట్ కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ వడోదర నగరం హర్నిలోని సొసైటీ నివాసితులు నిరసన తెలిపారు. ఎంట్రప్రెన్యూర్‌షిప్ అండ్ స్కిల్ డెవలప్‌మెంట్ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న 44 ఏళ్ల ముస్లిం మహిళకు 2017లో తక్కువ ఆదాయ వర్గాలకు చెందిన గృహ సముదాయంలో ఫ్లాట్ కేటాయించారు. అయితే ఆమె ఫ్లాట్ లోకి వచ్చే ముందే, ఆమె రాకను వ్యతిరేకిస్తూ.. గృహ సముదాయంలోని 30 మంది నివాసితులు జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు ఫ్లాట్‌ను 'ముస్లిం'కి కేటాయించడాన్ని వ్యతిరేకించారు.2020లో నివాసితులు తన కేటాయింపును చెల్లదని కోరుతూ ముఖ్యమంత్రి కార్యాలయానికి (CMO) లేఖ రాయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయని సదరు మహిళ మీడియాతో అన్నారు. అయితే, ఆ సమయంలో పోలీసులు ఫిర్యాదుదారుల నుంచి వాంగ్మూలాలను నమోదు చేసి అక్కడితోనే వదిలేశారు. అయితే తాజాగా జూన్ 10...