Weekly Horoscope : ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
Weekly Horoscope మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి అదృష్టం తోడవుతుంది. జూదము, వ్యసనాల జోలికి పోకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. చర్మ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యువెల్లరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. విద్యార్థులు భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. రాజకీయ నాయకులు వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటారు. ఆచారాలను పాటించడం వలన అందరి మెప్పులు పొందగలుగుతారు. దైవానుగ్రహం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో వృత్తిపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. కల్మషం లేకుండా శత్రువులను కూడా చేరదీస్తారు. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయాలి.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ శ్రమ లేకుండా ధనాన్ని సంపాదించాలని అనుకుంటారు. ప్రతి విషయంలోనూ ఓర్పు వహించండి. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా గమ్యాన్ని చేరుకోగలుగుతారు. నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. భార్య తరపు తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. ఉద్యోగస్తులు అభివృద్ధి కోసం శ్రమ చేయవలసిన సమయం. మీ జీవిత భాగస్వామితో కలహం అంత మంచిది కాదు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. తండ్రితో చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలదు. శుభకార్యాలు నిర్వహించే అవకాశం కలదు. ఈవారం చివరిలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ వారంలో ధర్మగుణంతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులకు విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. తండ్రి అనారోగ్య విషయంలో ఆందోళనకు గురవుతారు. రైల్వే ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. జ్యోతిష్య మరియు సినీ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. లిక్కర్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. ఒంటరిగా ఉండాలి అనే ఒక ఆలోచన విధానము ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు ఏర్పడతాయి. మంచి నిద్ర లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. అజీర్ణంతో ఇబ్బంది పడతారు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థికపరమైన ఇబ్బందులు చికాకులు ఉండును. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. పిల్లల విషయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి. ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన ఇబ్బందులు పడే అవకాశాలు కలవు. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షలు విజయాలు సాధిస్తారు. ప్రతి పనిని క్రమశిక్షణ పద్ధతిలో చేయడం ద్వారా అందరి మెప్పులను పొందగలుగుతారు. వడ్డీ వ్యాపారాలు చేసే వారికి కొంత ఇబ్బందులు ఉండను. స్త్రీలు అందం మీద ప్రతికమైన శ్రద్ధ చూపుతారు. దైవ భక్తితో గృహమునందు పూజ పునస్కారాలు నిర్వహించే అవకాశం కాదు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి.
సింహరాశి
సింహరాశి వారికి ఈ వారంలో కుటుంబ బాధ్యతను స్వీకరించ వలసి వస్తుంది. జూదము మరియు చెడు వ్యసనాల జోలికి పోకూడదు. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయం. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడతారు. ఇతరులను విమర్శించడం అంత మంచిది కాదు. పూజా సామగ్రి షాపు నడిపే వారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల ప్రవర్తన మీ ఆందోళనలకు కారణమవుతాయి. అనవసరమైన విషయాల పట్ల ఆసక్తి చూపకూడదు. వేళ తప్పిన భోజనము నిద్ర ఉండును. శ్రీ లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారంలో విదేశీ ప్రయత్నాలు సానుకూలము. విద్యార్థులు తమ గమ్య స్థానాని చేరుకోవడానికి తగిన శ్రమ చేయవలసిన సమయం. మీ జీవిత భాగస్వామితో కలహాము కలిగే అవకాశం కలుదు కాబట్టి కొంత సమన్వయంతో ఉండండి. పొత్తి కడుపుకి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ప్రతి విషయం నందు మొండితనం అంత మంచిది కాదు. మీ స్నేహితులతో మనస్పర్ధలు ఉండును. తిను బండారాలకు సంబంధించిన వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. ఎక్కువ శ్రమ లేకుండా ధనాన్ని సంపాదించాలనే ఒక ఆలోచన విధానం ఉంటుంది. మీ అభిప్రాయాలను తరచూ మార్చుకోవడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో ఏ సమస్య ఎదురైనా ధైర్యంగా తొందరగా నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. సంతాన భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేజారి పోతాయి. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన విద్యను అభ్యసించడానికి అడుగులు వేస్తారు. వాత సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. కొంత అప్పును తీర్చగలుగుతారు. రాజకీయరంగంలో ఉన్న వారికి యోగ కాలము. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో రెవెన్యూ డివిజన్ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండను. కోర్టు కేసు సంబంధించిన తగాదాలు వాయిదా పడతాయి. నూతన విద్యను అభ్యసించే వారికి కొంత ఇబ్బందులు ఉండును. కుడి కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వాహనము నడిపేటప్పుడు శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు. మీ తెలివితేటలతో వ్యాపారంలో అధిక లాభాలను పొందగలుగుతారు. సంగీతం, సాహిత్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. మిత్రులను కలుసుకొని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. రాజకీయరంగంలో ఉన్నవారికి వ్యూహాలు ఫలిస్తాయి. తొందరగా అలిసి పోతారు. సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ వారంలో సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి శత్రువులతో అప్రమత్తంగా ఉండాలి. రాజకీయరంగంలో ఉన్నవారికి అధికమైన జనాకర్షణ ఉంటుంది. ప్రభుత్వ పనులు ఆలస్యం అవుతాయి. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోకూడదు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. యోగా, వ్యాయామం మీద ప్రత్యేక మైన శ్రద్ధ చూపుతారు. సరైన ప్రణాళిక లేకుండా నిర్ణయాలు తీసుకో వడం వలన ఇబ్బందులు పడతారు. పాత బాకీలు వసూల్ అవుతాయి. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయాలి.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారంలో నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎందుకు విజయాలు సాధిస్తారు. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సమయానికి ధనం సర్దుబాటు అవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ నాయకత్వ లక్షణాలతో ప్రజలను ఆకట్టుకుంటారు. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. మెడికల్ షాపు నడిపే వారికి అధికమైన లాభాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో ఓర్పుగా వ్యవహరించాలి. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు అందం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు కొంతమేర తీరుతాయి. మానసికపరమైన ఒత్తిడిని ధైర్యంగా అధిగమించాలి. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి యోగ కాలము. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకోగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు వచ్చే అవకాశాలు కలవు. సోమరితనంతో పనులు వాయిదా వేయకూడదు. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. దూర ప్రాంత ప్రయాణంలో వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. దైవారాధన కోసం ఎక్కువ సమయాన్ని గడుపుతారు. సిద్ధి గణపతి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారంలో కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. అనవసరమైన విషయాల కోసం అధిక ధన వ్యయం చేయవలసి వస్తుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. చలి జ్వరంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. వడ్డీ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. కులవృత్తిలో ఉన్న వారికి అభివృద్ధి ఉంటుంది. ఇతరులకు సలహాలు ఇవ్వడం వలన ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామి అనారోగ్య సమస్యలు మీ మానసిక ఆందోళనకు కారణమవుతారు. మంచి నిద్ర లేకపోవడం వలన ఇబ్బంది పడతారు. మంచి మనసుతో శత్రువులను కూడా క్షమిస్తారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయాలి.
Weekly Horoscope By
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978