Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?
Weekly Horoscope in telugu: ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి 28 ఆదివారం నుంచి ఫిబ్రవరి 3 శనివారం వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చెయ్యి జారిపోయే అవకాశం కలదు. ప్రతి విషయంలోనూ భయపడకుండా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేయండి. Software ఉద్యోగస్తులకు స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు.తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. Fast food items వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయా...