Home » Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..
Astrology Signs Rashi Phalalu

Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

Spread the love

Astrology Signs | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తారు. 2024 మే 19 ఆదివారం నుంచి మే 25 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు

మేష రాశి

మేష రాశి (Aries) వారికి ఈ వారం (19’th May – 25’th May) లో నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలం. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. కుటుంబ పరమైన సమస్యలు ఉండను. భూమికి సంబంధించిన పనులు వాయిదా ప‌డ‌తాయి. కుటుంబ సభ్యుల విషయాల్లో తల దూర్చడం వల్ల అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. వ్యాపార విస్తరణ కోసం ధన వ్యయం చేయాల్సి వస్తుంది. వ్యర్థ కలహాలకు దూరంగా ఉండాలి. వేళ‌ తప్పిన భోజనం ఉంటుంది. ధనపరమైన ఇబ్బందులకు పరిష్కారాన్ని ఆలోచించాలి. Construction flied ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. స్త్రీల కోసం ధన వ్యయం చేయాల్సి వస్తుంది. శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు కలవు. ఆదాయం కొంత తగ్గుముఖం పట్టును. తలనొప్పితో ఇబ్బంది పడతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

వృషభ రాశి (Taurus) వారికి ఈ వారంలో శారీరక శ్రమ గోచరిస్తుంది. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. ఎడమ చేయి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. ముఖ్యమైన పనులు పూర్తి చేయడం కోసం తండ్రి సహాయాన్ని కోరుతారు. వ్యసనాల జోలికి పోవ‌ద్దు. మీరు ఇతరుల మీద చూపించే ప్రేమ, ఆరాటం వల్ల నష్టపోయే అవకాశం ఉంది. Chit fund వ్యాపారస్తులకు నష్టములు ఉండును. వీసా పనులు వాయిదా పడతాయి. శరీరంలో దాగి ఉన్న అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాకపోవడం మీ మానసికపరమైన ఒత్తిడికి కారణమవుతాయి. ఆవేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవ‌ద్దు. వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. Banking sector ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మిథున రాశి

మిథున రాశి (Gemini) వారికి ఈ వారంలో ఉన్నంతలో సంతృప్తి చెందుతారు. గృహంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. ఆకస్మిక విదేశీయాన పర్యటన చేసే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్నవారు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. Jewellery వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. Real Estate వ్యాపారస్తులకు నూతన వ్యక్తుల పరిచయాలు లాభిస్తాయి. అనవసరమైన ఆలోచనలు చేయకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. మధ్యవర్తిత్వం వల్ల లాభపడతారు. కడుపు నొప్పితో బాధపడతారు. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope | ఈ వారం (మార్చి 2 - 9)లో ఈ రాశుల వారికి ఆదాయం వృద్ధి...

కర్కాటక రాశి

కర్కాటక రాశి (Cancer) వారికి ఈ వారంలో సెంటిమెంట్ వస్తువులు చేజారిపోయే అవకాశం కలదు. వారం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయంలో ధైర్యాన్ని కోల్పోతారు. అప్పు తీర్చే విషయమై తల్లిదండ్రుల సహకారాన్ని అడుగుతారు. జీవిత భాగస్వామితో విదేశీ పర్యటన చేసే అవకాశాలు కలవు. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్త్రీల వలన సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కలవు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ప్రశంసలు పొందుతారు. గతంలో చేసిన పొరపాట్లకు తగిన ప్రతిఫలం అనుభవించవలసి వస్తుంది. నూతన వధూవరులు సమన్వయంతో ఉండాలి. ముఖ్యమైన పనులలో అదృష్టం తోడవుతుంది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. Surgical items వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

సింహ రాశి (Leo) వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణానికి అడుగులు పడే అవకాశాలు కలవు. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి అనుకూలం. శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టాలి. సుగర్ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. సంతాన భవిష్యత్తు గురించి Fixed Deposits చేస్తారు. Transco ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఇబ్బందులు ఉండును. తండ్రికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలను పరిష్కరించుకుంటారు. వృత్తిలో సోమరితనం పనికిరాదు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. oil వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. చర్మవ్యాధితో ఇబ్బంది పడతారు. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

కన్య రాశి (Virgo) వారికి ఈ వారంలో సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకొని సరదాగా కాలాన్ని గడుపుతారు. సంతానం కోసం ధన వ్యయం చేయవలసి వస్తుంది. తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. శ్వాసకోశ అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. దాంపత్యపరమైన సౌఖ్యం ఉంటుంది. తండ్రి కోసం ధన వ్యయం చేయవలసి వస్తుంది. అకారణ వైరాల‌కు దూరంగా ఉండాలి. అసంతృప్తి భోజనం ఉంటుంది. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. Textile వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా కలిసివస్తుంది?

తులా రాశి

తులా రాశి (Libra) వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు. అప్పు కొంత మేర తీర్చగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండండి. జీవిత భాగస్వామి కొరకు ధన వ్యయం చేయవలసి వస్తుంది. మధ్యవర్తిత్వం వల్ల లాభపడతారు. lower obedemen infections వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. liquor వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. తండ్రి నుంచి వచ్చే ఆస్తి విషయమై ఇబ్బందులను ఎదుర్కొంటారు. Software ఉద్యోగస్తులకు సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఉండును. Bank Loans మంజూరు అవుతాయి. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి (Scorpio Zodiac ) వారికి ఈ వారంలో స్థిరాసుల వల్ల లాభం చేకూరుతుంది. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. Food Infection తో ఇబ్బంది పడతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వైద్య వృత్తిలో ఉన్నవారికి ఆకస్మిక విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. మతి మరుపు వల్ల ఇబ్బంది పడతారు. సంతాన ఎదుగుదల చూసి సంతోష పడతారు. పోలీస్ శాఖ వారు లంచాలకు దూరంగా ఉండాలి. బార్ అండ్ రెస్టారెంట్ వ్యాపారస్తులకు నష్టాలు వ‌చ్చే అవకాశాలు ఉన్నాయి. అప్పు తీర్చడం ఒక సమస్యగా మారుతుంది. విద్యార్థులకు అనుకూలమైన సమయం. ఈ రాశి స్త్రీలు బంగారం కొనుగోలు చేస్తారు. వారాహి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ధనస్సు రాశి (Sagittarius Zodiac ) వారికి ఈ వారంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లేకపోవడం వల్ల మానసికపరమైన ఒత్తిడికి గురవుతారు. తండ్రికి అనారోగ్య సమస్యలు వచ్చును. శత్రువులను కూడా మంచి మనసుతో చేరదీస్తారు. పాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతాన ప్రవర్తన ఆలోచింపజేస్తుంది. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రులు ఆనందిస్తారు. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకుంటారు. ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. బ్యాంకు రుణాలు ( Bank Loans) ఆలస్యం అవుతాయి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సంఘంలో మీ మాట చెల్లుబాటు అవుతుంది. జీవిత భాగస్వామికి సంబంధించిన కోర్టు కేసులు వాయిదా పడతాయి. ధనపరమైన ఇబ్బందులు ఉండును. అడ్మినిస్ట్రేష‌న్ (Administration) ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి (Capricorn) వారికి ఈ వారంలో వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. జూదం వంటి వాటికి దూరంగా ఉండాలి. విద్యార్థులు తమ పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. తల్లి తరపు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీల కోసం ధన వ్యయం చేయవలసి వస్తుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. మెడిక‌ల్ షాప్ వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా నమ్మవద్దు. మీ పిల్లల తెలివితేటలను చూసి ఆశ్చర్యపోతారు. దైవ దర్శనాలు చేస్తారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కన్య రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

కుంభ రాశి

కుంభ రాశి (Aquarius Zodiac ) వారికి ఈ వారంలో విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ధర్మ గుణంతో ఇతరులకు సహాయం చేస్తారు. సెంటిమెంట్ వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. బంధు మిత్రులతో కలిసి విందు భోజనం చేస్తారు. స‌రైన‌ నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. వ్యాపార విస్తరణ కోసం ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేసుకోవాలి. భూమికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. వడ్డీ వ్యాపారస్తులకు income tax నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

Astrology : ఈ వారంలో మీన రాశి (Pisces Zodiac) వారికి దైవానుగ్రహం ఉంటుంది. కుటుంబ పరమైన సమస్యలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. ఆత్మ విశ్వాసంతో నిర్ణయాలు తీసుకుని అడుగులు ముందుకు వేస్తారు. సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. దుష్టులతో అకారణ కలహానికి దిగడం మంచిది కాదు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Software ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. ప్రయాణాల వల్ల లాభం చేకూరుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు స్నేహితులతో చర్చించి తీసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగట్టాలి. ఈ రాశి స్త్రీలు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. తినుబండారాల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Weekly Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..