Horoscope | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 ఏప్రిల్ 21 ఆదివారం నుంచి ఏప్రిల్ 27 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారంలో శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. బంధుమిత్రులను కలుసుకొని సరదాగా కాలాన్ని కలుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. అధికమైన ధన వ్యయము చేయవలసి వస్తుంది. Food items వ్యాపారస్తులు అధిక లాభాలను పొందగలుగుతారు. నూతన వధూవరుల మధ్య సఖ్యత బలపడుతుంది. ప్రతి చిన్న విషయంలోనూ మొండితనం అంత మంచిది కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులతో యాత్రలు చేసే అవకాశం కలదు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పిల్లల విషయంలో మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. పోలీస్ శాఖ వారు లంచాలకు దూరంగా ఉండండి. వేళ తప్పిన భోజనం ఉంటుంది. మూర్ఖత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టపోతారు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలంగా ఉంటుంది. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ వారంలో తండ్రి నిర్ణయాలను వ్యతిరేకిస్తారు. ఇతరుల మీద అతి ప్రేమ చూపించడం ద్వారా కొంత బాధకు గురవుతారు. ఇతరులకు సహాయం చేస్తారు. ఉద్యోగస్తుల వృత్తి పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం వలన ఇతరులు మిమ్మల్ని ద్వేషించే అవకాశం కలదు. ధనాన్ని పొదుపు చేసుకోవలసిందిగా చెప్పదగిన సూచన. చెడు స్నేహములకు దూరంగా ఉండండి. వెండి వ్యాపారస్తులకు అన్ని విధాల అదృష్టం తోడవుతుంది. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. విద్యార్థులకు మంచి కాలము. సంతాన ఎదుగుదలను చూసి ఆనందిస్తారు. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును. ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని అడుగులు ముందుకు వేస్తారు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మిధున రాశి
మిధున రాశి వారికి ఈ వారంలో తల్లితో కలహలు అయ్యే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. వృత్తిపరమైన ఎదుగుదల మానసిక ప్రశాంతతకు కారణమవుతాయి. విద్యార్థులు తమ లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. తండ్రి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. jewellery వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. పోలీస్ శాఖ వారికి పదోన్నతులు ఉండును. Bank loans మంజూరవుతాయి. అధిక ఖర్చులు చేయకూడదు. ముఖ్యమైన పనులు వాయిదా వేయకూడదు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. సంతాన ప్రయత్నాలు చేసే వారికి శుభవార్త వింటారు. ఆవేశపూరితమైన మాటలు మాట్లాడకూడదు. నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారు అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారంలో ఈ నిర్ణయమైనా మీ జీవిత భాగస్వామితో చర్చించి తీసుకుంటారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసే వారికి యోగ కాలము. అనవసరమైన విషయాలలో తలదురచకూడదు. మీ స్నేహితునికి ఆర్థిక సహాయం చేస్తారు. విద్యార్థులకు శుభ ఫలితాలు ఉండను. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదు అని అర్థమవుతుంది. మధ్యవర్తిత్వాల వల్ల లాభం చేకూరుతుంది. వాత సంబంధిత ఆరోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. కొడుకు యొక్క ప్రవర్తనను చూసి ఆనందిస్తారు. దైవరాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. మీ బలహీనతలు ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడండి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదని సూచన.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు తమ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ఎడమ కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. క్రీడా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలు చేజారి పోతాయి. Reportor ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని కలుపుతారు. తల్లితో కలహం అంత మంచిది కాదు. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును మరియు మీ జీవిత భాగస్వామికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి. సంకల్పించిన పనులు ఆలస్యం అవుతాయి. శరీరానికి గాయాలు అయ్యే అవకాశాలు కలవు. Court కేసులకు సంబంధించిన పనులు వాయిదా పడతాయి. ఉన్నదాంట్లో సంతృప్తి చెందుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఆలస్యాన సత్ఫలితాలు ఉండును. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు. Fire departmentలో పనిచేసేవారు జాగ్రత్తగా ఉండాలి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
కన్య రాశి
కన్య రాశి వారికి ఈ వారంలో చక్కటి ఆలోచన విధానంతో సేవా కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. మీ తల్లి గారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామితో యాత్రలు చేసే అవకాశం కలదు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మీ వాక్చాతుర్యంతో ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. విలాసవంతంగా కాలాన్ని గడుపుతారు. విద్యార్థులు తాము ఆశించిన ఫలితము పొందగలుగుతారు. ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి ఇబ్బందులు ఉండును. Iron వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. తండ్రి నిర్ణయాలతో ఏకీభవించవలసి వస్తుంది. కొన్ని సందర్భాలలో ధైర్యాన్ని కోల్పోతారు. సమయస్ఫూర్తితో పనులను పూర్తి చేస్తారు. మీ శ్రమతో పాటు అదృష్టం కూడా తోడు అవుతుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. Hair fall అధికమవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి వీసా మంజూరు అవ్వడం ఆలస్యం అవుతుంది. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారంలో నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ సంతానం తెలివితేటలు చూసి ఆశ్చర్యపోతారు. Paralysis వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. పిల్లల భవిష్యత్తు గురించి నిర్ణయాలు తీసుకునే విషయంలో Confusionకి గురవుతారు. రాజకీయరంగంలో ఉన్నవారు శత్రువుల వ్యూహాన్ని ముందుగానే పసిగడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. Real Estate వ్యాపారస్తులకు మంచి ఆదాయము ఉంటుంది. మీ జీవిత భాగస్వామి విషయంలో నిలకడైన ఆలోచన విధానం లేకపోవడం వల్ల ఇబ్బందులు పడతారు. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. మీ ఆలోచన విధానము మరియు ప్రవర్తన ఇతరుల మనసును నొప్పిస్తుంది. వృత్తిపరమైన పనులు ఆలస్యం అవుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. కాలభైరవ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారంలో సోదరీ సోదరులతో చర్చలు నిర్వహిస్తారు. సంతాన అభివృద్ధి కోసం పాటుపడతారు. విద్యార్థుల శ్రమ చేయడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యత బలపడుతుంది. సంతాన ప్రయత్నాలు చేసే వారికి ఇబ్బందులు ఉండును. Viral fever వచ్చే అవకాశాలు కలవు. జ్యోతిష్య రంగంలో ఉన్న వారికి పురోగతి ఉంటుంది. తండ్రికి ఎముకలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కలవు. వృత్తి పరమైన విషయాలలో మతిమరుపు మంచిది కాదు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. oil వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. సేవా కార్యక్రమాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి నిరాశ ఎదురు అవుతుంది. బ్యాంకు లోన్స్ మంజూరు అవుతాయి. అప్పు కొంత తీర్చగలుగుతారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఈ వారంలో కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. సోదరీ సోదరులతో తగాదాలు ఏర్పడతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. కళా రంగంలో ఉన్నవారికి సభా గౌరవం దొరుకుతుంది. నూతన వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు సంబంధించిన విషయాలలో ఆచితూచి అడుగులు వెయ్యాలి. మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి పదోన్నతులు ఉండును. Medical shops నడిపె వారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. Chit Fund వ్యాపారస్తులకు చట్టపరమైన ఇబ్బందులు ఉండును. వృత్తిపరమైన ఎదుగుదల కోసం శ్రమించాలి. సంగీతం పట్ల ప్రత్యేకమైన ఆసక్తి చూపుతారు. వాహన పరమైన ప్రమాదాలు జరిగే అవకాశాలు కలవు. మీ ఎదుగుదలను చూసి తల్లిదండ్రులు ఆనందిస్తారు. వృత్తి యందు ఇబ్బందులు ఎదురవుతాయి. జమానత్ సంతకాల జోలికి పోకూడదు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారంలో మంచి మనసుతో శత్రువులను కూడా క్షమిస్తారు. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. కుటుంబ పరమైన కలహాలకు దూరంగా ఉండాలి. విద్యార్థులు పోటీ పరీక్షలు యందు విజయాలు సాధిస్తారు. సోదరీ సోదరులతో ఆస్తి పంపకాలపై చర్చలు కొలిక్కి వస్తాయి. శరీరంలో వేడి పెరగడం వలన ఇబ్బంది పడతారు. వాహనలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. పాల వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. ప్రభుత్వ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ధనపరమైన ఇబ్బందులు ఉండును. మీ కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. ఇతరుల మీద Domination చేయడం అంత మంచిది కాదు. వ్యాపార భాగస్వాములను అతిగా నమ్మకూడదు. బంగారం కొనుగోలు చేస్తారు. ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకము చేయడం చెప్పదగిన సూచన.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి ఈ వారంలో ఉద్యోగస్తులు వృత్తిపరమైన అభివృద్ధి కోసం శ్రమ చేయవలసిన సమయము. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు తమ గమ్యస్థానానికి చేరుకోగలుగుతారు. ధనపరమైన ఇబ్బందులు ఉండును. రాజకీయరంగంలో ఉన్నవారికి ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఆకస్మిక ధన లాభం కలదు. మీ జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు తొలగుతాయి. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ సభ్యులతో వైరం అంత మంచిది కాదు. నూతన వాహన ప్రాప్తి కలదు. luxary itemsకి సంబంధించిన వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సినిమా రంగంలో ఉన్నవారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి. మీ పుత్ర సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ప్రభుత్వానికి సంబంధించిన పనులు తొందరగా పూర్తవుతాయి. మంచి నిద్ర ఉండదు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
మీన రాశి (Pisces Zodiac)
మీన రాశి వారికి ఈ వారంలో ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు తమ ఎంచుకున్న లక్ష్యాన్ని సులువుగా చేరుకోగలుగుతారు. అజీర్ణంతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. స్త్రీలు అందం మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న అభిప్రాయ బేధాలు తొలుగుతాయి. Software ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. కుటుంబ సభ్యులతో తగాదానికి దిగడం అంత మంచిది కాదు. స్నేహితులను కలుసుకొని సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. సంతాన భవిష్యత్తుకై ప్రణాళికను సిద్ధం చేయాలి. ఆర్థికపరమైన వెసులుబాటు ఉంటుంది. Chit Fund వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండను. మీ ముక్కుసూటితనంతో సమస్యలను కొని తెచ్చుకుంటారు. ఎవరిని అతిగా నమ్మవద్దు మోసం చేసే వాళ్ళు వెన్నంటే ఉంటారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో కుటుంబ సభ్యుల సలహా కోరుతారు. విజయ గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.
Weekly Horoscope Signs By
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..