
Weekly Horoscope: నవంబర్ 19 నుంచి 25వరకు.. ఏ రాశి వారికి ఎలా ఉంటుంది?
Weekly Horoscope : ఈ వారంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 19 నుంచి నవంబర్ 25, 2023 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
మేష రాశి
Weekly Horoscope మేష రాశి వారికి ఈ వారంలో మీ కష్టానికి అదృష్టం తోడవుతుంది. జూదము, వ్యసనాల జోలికి పోకూడదు. ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఆలస్యం అవుతాయి. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. చర్మ ఇన్ఫెక్షన్లతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. జ్యువెల్లరీ వ్యాపారస్తులకు కొంత ఇబ్బందులు ఉండును. విద్యార్థులు భవిష్యత్తు కోసం తగిన ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉండును. రాజకీయ నాయకులు వాక్చాతుర్యంతో సభను ఆకట్టుకుంటార...