Home » Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Minor Girls Eggs Selling | సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల అండాల అమ్మకం.. నలుగురు నిందితుల అరెస్ట్‌

Spread the love

లక్నో: సంతానం లేని దంపతులకు మైనర్‌ బాలికల నుంచి సేకరించిన అండాలు విక్రయిస్తున్నారు. (Minor Girls Eggs Selling) నిరుపేద కుటుంబాలలోని బాలికలకు డబ్బులు ఆశ చూపించి ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఈ ఘటన జరిగింది. సంతానం కోసం ఐవీఎఫ్‌ సెంటర్లకు వచ్చే దంపతులకు మైనర్ బాలికల అండాలు విక్రయిస్తున్నట్లు 17 ఏళ్ల బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డబ్బుతో అమ్మాయిలను ఎరగా వేసి వారి వయసుకు సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టిస్తున్నారని ఆరోపించింది.. మరోవైపు బాలిక అండాల కోసం రూ.30,000 ఇస్తామని చెప్పి 11,500 రూపాయలు మాత్రమే చెల్లించాలని ఫిర్యాదులో పేర్కొంది.

READ MORE  Nanded hospital news: రెండు రోజుల్లో 31మంది మృతి.. ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది?

కాగా, వారణాసి పోలీసులు దీనిపై విచారణ చేపట్టారు. వారణాసి నవపుర ప్రాంతానికి చెందిన సీమా దేవి, ఆమె భర్త ఆశిష్ కుమార్, ఖోంజ్వాన్‌ ప్రాంతానికి చెందిన అనితా దేవి, సోన్ భద్రకు చెందిన అన్మోల్ జైస్వాల్ ను అరెస్టు చేశారు. ఐవీఎఫ్‌ సెంటర్‌ సిబ్బంది, వైద్యులకు ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. దీనిపైనా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్‌ అధికారి ఒకరు వెల్లడించారు.

నిబంధనల ప్రకారం అండం దానం చేసే మహిళ వయసు కనీసం 23 ఏళ్లకు మించి ఉండాలి. ఆమెకు వివాహం కావడంతో పాటు మూడేళ్లకు పైగా వయస్సు ఉన్న బిడ్డ ఉండాలి. అలాగే ఒక మహిళ జీవిత కాలంలో ఒక్కసారి మాత్రమే అండ దానం చేసేందుకు అర్హురాలని పోలీసు అధికారి తెలిపారు.

READ MORE  Tamil Nadu : మదురై రైల్వే జంక్షన్ వద్ద రైలులో భారీ అగ్నిప్రమాదం, 10 మంది మృతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..