Home Telangana Rain Alert : గుడ్‌న్యూస్‌.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!

Rain Alert : గుడ్‌న్యూస్‌.. ఈ జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు..!

0
10
Rain Alert
Spread the love

Rain Alert | తెలంగాణలో రానున్న మూడురోజుల పాటు కొన్ని జిల్లాలో వడగాలులు, మ‌రికొన్ని జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముంద‌ని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ఈమేర‌కు సోమవారం ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ‌ర‌ణ కేంద్రం పేర్కొంది.

Rain Alert  ఈనెల 8న సోమవారం వనపర్తి, జోగులాంబ గద్వాలలో తీవ్ర‌మైన‌ వడగాలులు వీస్తాయని ప్ర‌జ‌లు అప్ర‌మత్తంగా ఉండాల‌ని సూచించింది. ఇక ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగితాల్య, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో చ‌ల్ల‌ని క‌బురు చెప్పింది వాతావ‌ర‌ణ‌కేంద్రం ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. మంగళవారం కూడా పలుచోట్ల తేలికపాటి జల్లులు కురుస్తాయని వెల్ల‌డించింది. ఉమ్మడి నిజామాబాద్‌, కరీంనగర్, ఆదిలాబాద్‌ జిల్లాలతో పాటు భూపాలపల్లి, ములుగు, మెదక్‌ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఉరుములు, మెరుపులతో వ‌ర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ పేర్కొంటూ.. ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here