Home » Ugadi Panchangam Simha Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు..
Ugadi Panchangam Simha Rashi Phalalu

Ugadi Panchangam Simha Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు..

Spread the love

Ugadi Panchangam Simha Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈ ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా ఈ శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో  సింహ రాశి వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 2
  • వ్యయం – 14
  • రాజపూజ్యం – 2
  • అగౌరవం – 2

Simha Rashi Phalalu : ఈ సంవత్సరం సింహ రాశి (Leo) వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు దశమ స్థానంలో బృహస్పతి , శని సప్తమ స్థానం నందు , రాహువు అష్టమ స్థానం నందు మరియు కేతువు ద్వితీయ స్థానంలో సంచరిస్తున్నాడు.

READ MORE  Ugadi Panchangam karkataka Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో సింహ రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కులవృత్తిలో ఉన్నవారికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. ఉద్యోగస్తులు వృత్తిలో  ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. మీ అర్హతకి తగిన గుర్తింపు, సభా గౌరవం లభిస్తాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కుటుంబానికి దూరంగా ఆకస్మిక విదేశీ పర్యటన చేయవలసి వస్తుంది. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి.

నూతన ఆదాయ మార్గాలను అన్వేషించాలి. అప్పు తీర్చే విషయమై మానసికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ దగ్గర వారు మిమ్మల్ని సహాయం అడిగినప్పుడు నిర్మోమాటంగా తిరస్కరించడం చెప్పదగిన సూచన.  కారణం ధనాన్ని నష్టపోయే అవకాశం కలదు. కుటుంబ సభ్యులతో శాంతంగా వ్యవహరించాలి. విద్యార్థులు ఆశించిన దాని కన్నా అధిక సత్ఫలితాలను పొందగలుగుతారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు యోగ కాలం. ప్రభుత్వ పరిపాలన విభాగంలో ఉన్న అధికారులకు పదోన్నతులు ఉండును. పోలీసు శాఖ వారికి పని భారం అధికంగా ఉంటుంది. కళా రంగంలో ఉన్నవారికి ప్రభుత్వం నుంచి మంచి ప్రశంస లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి ప్రారంభంలో ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరికి అనుకున్న గమ్యం చేరుకోగలుగుతారు.

READ MORE  Horoscope | వార ఫలాలు.. 12 రాశులవారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకోండి..

 క్రోధి నామ ఉగాది పంచాంగం: కర్కాటక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

Central Nervous system కి సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడే అవకాశాలు కలవు. Pooja Store వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. Medical Agencies వ్యాపారస్తులకు స్వల్ప లాభాలు ఉండును. నూతనంగా వివాహమైన వారికి జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బ్యాంకు లోన్స్ ఆలస్యం అవుతాయి. సేవ కార్యక్రమాల కొరకు ధన వ్యయం చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. మఖ నక్షత్ర గర్భిణీలకు అబార్షన్ అయ్యే అవకాశాలు కలవు. తండ్రి నుంచి వచ్చే ఆస్తి చేతికి అందుతుంది. పుబ్బ నక్షత్ర జాతకులకు ఎముకలు, కండరాల అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి న్యాయపరమైన ఇబ్బందులు ఏర్పడతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ అప్పు చేయకూడదు కారణం ఈ సంవత్సరంలో చేసిన అప్పు తీర్చడానికి చాలా కాలం పడుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి Fake Documents వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఈ రాశి వారు శనికి,  రాహువు కేతువులకు గ్రహ జపములు జరిపించి తగు దానాలు ఇవ్వవడం మంచిది.  వెంకటేశ్వర స్వామి ఆరాధన చెప్పదగిన సూచన. ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు.

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Astrology Signs  By

 

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

 

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..