Tuesday, May 20Welcome to Vandebhaarath

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కన్య రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Spread the love

Kanya Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో కన్య రాశి (Virgo) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 5
  • వ్యయం – 5
  • రాజపూజ్యం – 5
  • అగౌరవం – 2

Ugadi Panchangam 2024 | క్రోధి నామసంవత్సరం కన్య రాశి వారికి 2-05-2024 నుంచి సంవత్సరాంతం వరకు భాగ్య స్థానంలో బృహస్పతి , శని షష్ఠమ స్థాన నందు , రాహువు సప్తమ స్థానం నందు మరియు కేతువు తను స్థానంలో సంచరిస్తున్నాడు..

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో కన్య రాశి వారికి విలువైన వస్తువులు, ధనాన్ని జాగ్రత్త పరుచుకోవలసిందిగా చెప్పదగిన సూచన. గృహంలో అగ్ని సంబంధిత వస్తువులతో అప్రమత్తంగా ఉండాలి. గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొని సక్రమమైన మార్గంలో నడుస్తారు. కులవృత్తిలో ఉన్న వారికి యోగ కాలము. తరచూ మీ అభిప్రాయాలను ఆలోచనలను మార్చుకోవడం ద్వారా ఇతరులు మిమ్మల్ని వేలెత్తి చూపించే అవకాశం కలదు. శత్రువుల మీద విజయం సాధిస్తారు. ముఖ్యమైన పనులలో అదృష్టం తోడవుతుంది. జీవిత భాగస్వామితో legal issues మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కలదు.

విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాలు సాధిస్తారు. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులు నచ్చిన instutions లో  సీట్లు సంపాదిస్తారు. Interior designing రంగంలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం, అభినందనలు లభిస్తాయి. కళా రంగంలో ఉన్న వారికి నూతన అవకాశాలను సద్వినియోగ పరుచుకోవడం ద్వారా సత్ఫలితాలను పొందగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి శుభ ఫలితాలు ఉండను. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకూడదు.

బంగారం, Emitation Jewellery వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. Bar and Restaurant వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉంటాయి. నూతన వ్యాపారానికి పెట్టుబడులు పెట్టడానికి ఈ సంవత్సరం అనుకూలం. పుణ్యక్షేత్రాలు కుటుంబ సభ్యులతో సందర్శిస్తారు. వివాహం,  సంతాన ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. Court కేసుల విషయంలో మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తండ్రితో,  సోదరి సోదరులతో ఆస్తి తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి.

Ugadi Panchangam  క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు..

ఈ రాశి స్త్రీలకు గర్భానికి సంబంధించిన అనారోగ్య సమస్యలు నిర్ధారణ కాకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి Income Tax నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. పోలీస్ శాఖ ఉద్యోగస్తులు corruption కి దూరంగా ఉండాలి. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు మీ మానసికపరమైన ఒత్తిడికి కారణం అవుతాయి. మధ్యవర్తిత్వాలు జోలికి పోకూడదు కారణం గౌరవం కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. విదేశీ ప్రయత్నాలు సానుకూలం. స్థిరంగా నిర్ణయాలు తీసుకుని సత్ఫలితాలను పొందుతారు. కొన్ని సందర్భాలలో ధనపరమైన ఇబ్బందులు ఉండును. ఈ రాశి వారు రాహువు, కేతువులకు జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలయును. చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..