Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
Spread the love

Panchangam Thula Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో తులా రాశి (libra) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 2
  • వ్యయం – 8
  • రాజపూజ్యం – 1
  • అగౌరవం – 5

ఈ సంవత్సరం తులా రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు అష్టమ స్థానంలో బృహస్పతి , శని పంచమ స్థానము నందు , రాహువు షష్టమ స్థానం నందు మరియు కేతువు ద్వాదశ స్థానం నందు సంచారం చేస్తున్నాడు.

Ugadi Panchangam 2024 Thula Rashi Phalalu : శ్రీ క్రోధి నామ సంవత్సరంలో తులా రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. విద్య వృత్తి యందు ఆటంకాలు ఎదురవుతాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించదు. సెంటిమెంట్  వస్తువులు చేయి జారిపోయే అవకాశాలు కలవు కాబట్టి ప్రయాణ సమయంలో జాగ్రత్త వహించండి. కొంత అప్పుని తీర్చగలుగుతారు. ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకోని అడుగులు ముందుకు వేస్తారు.

పిల్లల ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళనకు గురవుతారు. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దూర ప్రాంత ప్రయాణాలు తరచూ వాయిదా పడతాయి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. విద్యార్థులు అధిక శ్రమ చేయవలసిన సమయము. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వారికి స్థాన చలనం కలిగే అవకాశాలు కలవు. Navy, రక్షణ శాఖ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండను. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి నిరాశ తప్పదు. Diabetes తో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. Medical shop,  finance వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది.

క్రోధి నామ ఉగాది పంచాంగం: కన్య రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఇవీ.. 

నూతన వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకునే వారికి Bank loans ఆలస్యం అవుతాయి. స్వాతి నక్షత్ర జాతకులు ఎక్కువ సమయం దైవారాధనతో గడుపుతారు. వివాహ, సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఇబ్బందులు, చికాకులు ఉండను. రాజకీయరంగంలో ఉన్న వారి సహాయంతో భూమికి సంబంధించిన పనులు పూర్తవుతాయి. నూతన భూమి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఈ రాశి స్త్రీలకు మీ బంగారాన్ని మీ దగ్గర వారు అడిగినప్పుడు నిర్మోమాటంగా తిరస్కరించడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్త్రీల వల్ల ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు కలవు. నూతన వధూవరుల మధ్య సఖ్యత బలపడుతుంది. గతంలో చాలా కాలం నుండి ఇబ్బంది పెడుతున్న భూమికి సంబంధించిన సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. Skin Infection తో ఇబ్బంది పడతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. Bank ఉద్యోగస్తులకు పని భారం అధికంగా ఉంటుంది. ఈ రాశి వారు గురువుకి, శని మరియు కేతువు గ్రహములకు జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. గణపతికి ఘరకతో పూజ చేయడం చెప్పదగిన సూచన.

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.
Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *