Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృశ్చిక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృశ్చిక రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?
Spread the love

Panchangam Vrichika Rashi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెలుగు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో వృశ్చిక రాశి (Scorpio Horoscope) వారికి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 8
  • వ్యయం – 14
  • రాజపూజ్యం – 4
  • అగౌరవం – 3

ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు సప్తమ స్థానంలో బృహస్పతి , శని చతుర్ధ స్థాంము నందు , రాహువు పంచమ స్థానం నందు, కేతువు ఏకాదశ స్థానం నందు సంచారం చేస్తున్నాడు.

READ MORE  Weekly Horoscope : 12 రాశుల వారికి గ్రహ ఫలాలు..

Vrichika Rashi Phalalu 2024 : శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి బంధుమిత్రులతో మనస్పర్ధలు తొలుగుతాయి. సంకల్పించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సంతాన భవిష్యత్తు కొరకు ధనాన్ని పొదుపు చేస్తారు. గృహపరమైన సమస్యలు ఉండే అవకాశాలు కలవు. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ Sixth Sense తో రాబోయే సమస్యలను ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు నిర్ణయాలు తీసుకుంటారు.

విద్యార్థులకు శుభ ఫలితాలు ఉండును. పోటీ పరీక్షల్లో విజయాలు సాధిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. Irrigation, Administration ఉద్యోగస్తులకు వృత్తిలో ఉన్న ఆటంకాలు తొలగి పదోన్నతులు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి దైవానుగ్రహం ఉంటుంది. అనురాధ నక్షత్ర జాతకులకు శరీరం బరువు పెరగడం ఒక సమస్యగా మారుతుంది. Food items,  paper industry వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. నూతన వ్యాపార నిమిత్తమై అధిక పెట్టుబడులు పెడతారు. వివాహ ప్రయత్నాలు చేసేవారు శుభవార్త వింటారు. Court కేసుల యందు అనుకూలత ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయాలు లాభాన్ని చేకూరుస్తాయి. స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వల్ల ఇబ్బంది పడతారు.

READ MORE  Zodiac Sign | వారఫలితాలు తేదీ 10 మార్చి 2024 ఆదివారం నుంచి 16 శనివారం వరకు..

క్రోధి నామ ఉగాది పంచాంగం: తులా రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి?

రాజకీయ రంగంలో ఉన్నవారు మీ వాక్చాతుర్యంతో ప్రజలను ఉద్వేగ పరుస్తారు. Chit Fund,  Textile వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి income tax నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. జీవిత భాగస్వామితో సరదాగా కాలాన్ని గడుపుతారు. ఎవరిని అతిగా నమ్మి జమానతు సంతకాలు పెట్టకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. చెడు ఆలోచనలకు దూరంగా ఉండండి. వెండి,  బంగారం వ్యాపారస్తులు మీ తెలివితేటలతో అధిక లాభాలను పొందగలుగుతారు. నూతన వాహన కొనుగోలు చేసే అవకాశాలు కలవు. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు నడుము నొప్పితొ ఇబ్బంది పడతారు. నూతన విద్యను అభ్యసించే వారికి ఇబ్బందులు ఉండును. ఈ రాశి వారు అర్ధాష్టమ శనికి మరియు రాహువుకి జపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. నిత్యము శివార్చన చేయడం, చండీ అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Weekly Horoscope | వార ఫలాలు : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉందంటే..?

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక

డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Organic Forming, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *