Home » Ugadi Panchangam | క్రోధి నామ ఉగాది పంచాంగం: మిథున రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..
Ugadi Panchangam Mithuna Rasi Phalalu

Ugadi Panchangam | క్రోధి నామ ఉగాది పంచాంగం: మిథున రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Spread the love

Ugadi Panchangam Mithuna Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో మిధున రాశివారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. కొత్త ఏడాదిలో మేష‌రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే..!

  • ఆదాయం – 5
  • వ్యయం – 5
  • రాజపూజ్యం – 3
  • అగౌరవం – 6
READ MORE  Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?

ఈ సంవత్సరంలో మిథున రాశి (Gemini) వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు ద్వాదశ స్థానం నందు బృహస్పతి , శని భాగ్య స్థానంలో, రాహువు దశమ స్థానం నందు, కేతువు చతుర్ధ స్థానంలో సంచారం చేస్తున్నాడు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మిథున రాశి వారికి శ్రమకు తగిన గుర్తింపు , ప్రశంసలు, సభా గౌరవం లభిస్తుంది. నూతన ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. గృహము నందు శుభకార్య నిమిత్తమై అధిక ధనం చేయవలసి వస్తుంది. పునర్వసు నక్షత్ర స్త్రీలకు గర్భ సంబంధిత రోగాలతో ఇబ్బంది పడతారు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి యోగదాయకమైన సంవత్సరం. కుటుంబ సభ్యులతో విదేశీయాన పర్యటనలు చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేసే వారు శుభవార్త వింటారు. వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి.. కారణం శరీరానికి గాయాలయ్యే అవకాశాలు కలవు. పోలీస్ శాఖ వారు లంచాలకు దూరంగా ఉండాలి. నూతన విద్యను అభ్యసించే విద్యార్థులకు అధిక శ్రేమ చేయవలసి వస్తుంది.

READ MORE  Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?

ప్రభుత్వ వైద్య వృత్తిలో ఉన్న వారికి స్థాన చలనం కలుగుతుంది. పైరవీల ద్వారా ఉద్యోగాన్ని పొందగలుగుతారు. తల్లి గారి ఆరోగ్య సమస్య మిమ్మల్ని బాధ పెడుతుంది. ఈ రాశి స్త్రీలు బంగారి ఆభరణాలు కొనుగోలు చేస్తారు. యోగా , ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతారు. ధనాన్ని కొంత పొదుపు చేస్తారు. Travel Agency వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మతిమరుపు, సోమరితనం వల్ల ఇబ్బందులు పడతారు. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేయి జారిపోతాయి.

Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Ugadi Panchangam Mithuna Rasi Phalalu  రాజకీయరంగంలో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. Construction రంగంలో ఉన్నవారికి నూతన వ్యక్తుల పరిచయాలతో లాభం చేకూరుతుంది. ఆరుద్ర నక్షత్ర జాతకులకు నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. తల్లి గారి తరపు నుంచి కొంత ఆస్తి కలిసి వస్తుంది. మధ్యవర్తిత్వములను నష్టపోయే అవకాశాలు కలవు. మీడియా రంగంలో ఉన్న వారికి పని భారం అధికము. ఈ రాశి గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి కారణం అధిక రక్తస్రావము వలన ప్రసవము కష్టమవుతుంది. కుటుంబ రహస్యాలు ఇతరులతో చర్చించకూడదు. సంగీతం పట్ల ఆకర్షితులవుతారు. సోదరీ సోదరులతో సఖ్యత బలపడుతుంది. మృగశిర నక్షత్ర జాతకులకు శరీర బరువు పెరగడం పెద్ద సమస్యగా మారుతుంది. ఈ రాశి వారు గురువు, కేతువు గ్రహ జపము చేయించి తగు దానములు ఇవ్వవలెను. గణపతి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam Makar Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: మకర రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..