Home తాజా వార్తలు astrology Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభ రాశి ఫలితాలు ఎలా...

Ugadi Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: వృషభ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

0
9
Vrishabha Rasi Ugadi Rasi Phalalu
Spread the love

Vrishabha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాల‌మానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొద‌ల‌వుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవ‌త్స‌ర వేడుక‌లు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవ‌త్స‌రంలో వృషభ రాశి వారికి ఎలా ఉండ‌బోతున్న‌ది అనే వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు.

  • ఆదాయం – 2
  • వ్యయం – 8
  • రాజపూజ్యం – 7
  • అగౌరవం – 6

ఈ సంవత్సరం వృషభ రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు తను స్థానంలో, శని దశమ స్థానంలో , రాహువు లాభ స్థానం నందు, కేతువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు.

శ్రీ క్రోధి నామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఆదాయ ఎదుగుదల గోచరిస్తుంది. అప్పు కొంత మేర తీర్చగలుగుతారు. కుటుంబంలో శుభకార్య నిమిత్తమై ధన వ్యయం చేయవలసి వస్తుంది. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇనుముకు సంబంధించిన వ్యాపారస్తులు కొంత నష్టపోతారు. జ్యేష్ట సంతాన ఆరోగ్యం కోసం ధనం ఖర్చు చేస్తారు. గృహం నందు విలాస వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక విదేశీయాన పర్యటనలు చేయవలసి వస్తుంది. రవాణా శాఖ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు స్థాన చలనం. బంగారం వెండి వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది.

Mesha Rasi Ugadi Rasi Phalalu| క్రోధి నామ ఉగాది పంచాంగం: మేష రాశి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి..

Software ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. రాజకీయరంగంలో ఉన్నవారికి పలుకుబడి పెరుగుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా ఉంటాయి. నూతన విద్యాభ్యాసం కోసం విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. పోటీ పరీక్షలు ప్రభుత్వం వాయిదా వేయడం వలన కొంత మానసికపరమైన ఒత్తిడికి గురి అవుతారు. Electricity Department ఉద్యోగస్తులకు అధికమైన పని భారం ఉంటుంది. Bar & Restaurant వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది. మానసిక ఉల్లాసంతో కాలాన్ని గడుపుతారు. చాలా కాలం నుండి ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడతాయి. రోహిణి నక్షత్ర జాతకులు జమానతు సంతకాలు, మధ్యవర్తిత్వాములకు దూరంగా ఉండాలి. వీలైనంతవరకు అప్పు చేయకూడదు. Food Business లో ఉన్న వ్యాపారస్తులకు మంచి యోగ కాలం. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం.

Vrishabha Rasi Ugadi Rasi Phalalu సినిమా రంగంలో ఉన్నవారికి అందరి ప్రోత్సాహం లభిస్తుంది. తండ్రితో అకారణ కలహాలు ఏర్పడతాయి. Printing Press రంగంలో ఉన్నవారు వ్యాపార విస్తరణ చేస్తారు. ఈ సంవత్సరం ఈ రాశి వారు నూతన వాహన కొనుగోలు చేస్తారు. కృత్తిక నక్షత్ర గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వలన ఇబ్బంది పడతారు. ప్రతి పని యందు స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఎవరికీ చెప్పకుండా కొంత ధనాన్ని పొదుపు చేస్తారు. చిన్ననాటి మిత్రులు కలుసుకొని సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ రహస్యాలు ఇతరులతో చర్చించ కూడదు. సోదరీ సోదరుల నుంచి శుభవార్త వింటారు. Real Estate వ్యాపారంలో పెట్టుబడులు పెట్టి లాభాలను పొందుతారు. పిల్లల ఎదుగుదలను చూసి సంతోషపడతారు. నడుము నొప్పి ఒక సమస్యగా మారుతుంది. దత్తాత్రేయ స్వామి ఆరాధన చెప్పదగిన సూచన.

Astrology Signs  By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ

7730023250, 8978510978


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

🇮🇳 జాతీయ ప్రయోజనాలే పరమావధిగా.. 🇮🇳

వందేభారత్ డిజిటల్ సైన్యంలో చేరండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here