Mesha Rasi Ugadi Rasi Phalalu | హిందూ కాలమానం ప్రకారం, ప్రతీ సంవత్సరం ఛైత్ర మాసం శుక్ల పక్షం పాడ్యమి తిథి నాడు తెలుగు నూతన సంవత్సరం (Ugadi Festival 2024 ) మొదలవుతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం నాడు కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోనున్నారు. ఈసారి వచ్చే ఏడాదిని శ్రీ క్రోధి నామ సంవత్సరం అని పిలుస్తారు.. కాగా శ్రీ క్రోధి నామ సంవత్సరంలో మేష రాశివారికి ఎలా ఉండబోతున్నది అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందా.. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు శ్రీ క్రోధి నామ సంవత్సర ప్రాముఖ్యతలేంటి.. కొత్త ఏడాదిలో మేషరాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయంటే..!
- ఆదాయము – 8
- వ్యయము – 14
- రాజపూజ్యము – 4
- అగౌరవము – 3
Mesha Rasi Ugadi Rasi Phalalu : ఈ సంవత్సరం మేష (Mesha) రాశి వారికి 2-05-2024 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానంలో బృహస్పతి సంచారం , శని ఏకాదశ స్థానంలో సంచారం , రాహువు ద్వాదశ స్థానంలో సంచారం, కేతువు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు.
క్రోధి నామ సంవత్సరంలో మేషరాశి (Aries) వారు వ్యర్ధ సంచారం చేయవలసి వస్తుంది. కుటుంబపరమైన సౌఖ్యము ఉంటుంది. నూతన గృహ నిర్మాణం చేసే అవకాశాలు కలవు. తీర్థయాత్రలకై ఎక్కువ ధనాన్ని ఖర్చు చేస్తారు. అప్పు కొంతమేర తీర్చగలుగుతారు. తల్లితండ్రుల దీవెనలు , దైవానుగ్రహం, గురువుల ఆశీర్వచనములు పొందగలుగుతారు. అనవసరమైన విషయాలలో తల దూర్చడం వలన అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాలలో ఆదాయానికి మించిన ధన వ్యయం చేయవలసి వస్తుంది.రాహువు ప్రభావం చేత జూదం, చెడు వ్యసనముల వలన ఇబ్బంది పడతారు.
మధ్యవర్తిత్వం కలిసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన సమయం. విద్యార్థులు సత్ఫలితాలు పొందుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి యోగ కాలం. ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారు ప్రభుత్వం నుంచి ప్రశంస పత్రములు పొందుతారు. Real Estate వ్యాపారస్తులకు అనుకూలమైన సంవత్సరం. పోలీసు శాఖ వారికి స్థాన చలనం ఉండును. Rice Mill వ్యాపారస్తులకు Sales Tax Department నుంచి నోటీసులు అందుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. Banking , Insurance, Oil Companies లో పనిచేసే వారికి పదోన్నతులు ఉండును. రాజకీయరంగంలో ఉన్నవారికి అత్యంత యోగ కాలము. అశ్వినీ నక్షత్ర జాతకులకు మతిమరుపు వలన ఇబ్బందులు ఎదురవుతాయి. భూమికి సంబంధించిన కోర్టు కేసులు తరచూ వాయిదా పడుతూ ఉంటాయి.
చిట్ వ్యాపారులకు..
భరణి నక్షత్ర స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. Chit Fund వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. ఎట్టి పరిస్థితులలోనూ జమాలతో సంతకాలు చేయకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసేవారు Documents Correct గా Check చేసుకోవాల్సిందిగా చెప్పదగిన సూచన. గృహ నిర్మాణ నిమిత్తమై Goverment Permissions మంజూరవుతాయి. Software ఉద్యోగస్తులకు onsight అవకాశాలు లభిస్తాయి. క్రీడారంగంలో ఉన్నవారు అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. Bank Loans కొంత ఆలస్యమైనప్పటికీ మంజూరు అవుతాయి. విదేశీయాన ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. అనుభవం ద్వారా కొన్ని సమస్యలను ముందుగానే గ్రహించి పరిష్కార మార్గాలను సిద్ధం చేస్తారు.
సినిమా, మీడియా రంగంలో ఉన్నవారు..
Mesha Rasi Ugadi Rasi Phalalu సినిమా రంగంలో ఉన్నవారికి ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అనుకూలమైన సమయము. మీడియా రంగంలో ఉన్నవారికి మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. భరణి నక్షత్ర గర్భిణీ స్త్రీలకు C – Section ఆపరేషన్ అవుతుంది. కృత్తికా నక్షత్ర జాతకులకు పంటి నొప్పి ఒక సమస్యగా మారుతుంది. కొంత మానసిక పరమైన ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ మేష రాశి వారికి ఈ సంవత్సరము అత్యంత యోగదాయకమైన సంవత్సరం గానే చెప్పుకోవచ్చును. ఈ రాశి జాతకులు తప్పనిసరిగా రాహువు గ్రహా జపము జరిపించి మినుముల దానము ఇవ్వవలెను. దుర్గా అమ్మవారి ఆరాధన చెప్పదగిన సూచన.
Astrology Signs By
స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..