న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) ముమ్మాటికీ మనదేనని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు . భారత్‌లో అతర్భాగమైన పీవోకేలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు వెల్లడించారు. తాజాగా రెండు ‘నయా కశ్మీర్’ బిల్లులను (‘Naya Kashmir’ Bills) కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.
Naya Kashmir Bills జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు- 2023పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రసంగించారు. జమ్ముకశ్మీర్‌లో హక్కులు కోల్పోయిన కశ్మీరీ పండిట్లకు ఈ బిల్లులు తగిన న్యాయం చేస్తాయన్నారు. కశ్మీర్‌లో గతంలో 46 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 47 కు పెంచినట్లు చెప్పారు. అదేవిధంగా జమ్ములో గతంలో 37 సీట్లు ఉండగా ఆ సంఖ్యను 43 కు పెంచినట్లు వివరించారు.. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) కూడా మనదేనని.. అందుకే ఆ ప్రాంతంలో 24 సీట్లు రిజర్వ్ చేసినట్లు అమిత్ షా వెల్లడించారు.
న్యూస్ అప్ డేట్స్ కోసం వందేభారత్ వాట్సప్ చానల్ లో చేరండి
కాగా, భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చేసిన రెండు పొరపాట్ల కారణంగా జమ్ముకశ్మీర్ లో ఇబ్బందులు ఎదురయ్యాయని, అమిత్‌షా విమర్శించారు. ముందుగా కాల్పుల విరమణ ప్రకటించి, ఆ తర్వాత కశ్మీర్ సమస్యను ఐక్యరాజ్యసమితికి తీసుకెళ్లార ని చెప్పారు. ‘ఇది నా తప్పు అని నెహ్రూ జీ చెప్పారు. ఇది తప్పు కాదు, ఈ దేశం చాలా భూమిని కోల్పోవడం పెద్ద తప్పు’ అని వ్యాఖ్యానించారు. మరోవైపు నెహ్రూ గురించి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. సభ నుంచి వా కౌట్ చేశారు. అనంతరం జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్ము, కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ(సవరణ) బిల్లు- 2023 రెండూ లోక్‌సభలో ఆమోదం పొందాయి.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్ లో జాయిన్ కండి.