Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్ పరిధిలోసబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా వాపి స్టేషన్లను నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో బోయిసర్, విరార్, థానే, ముంబై లో స్టేషన్లు ఉన్నాయి.
ఇటీవలి నివేదికలు గుజరాత్‌లో బుల్లెట్ రైలు స్టేషన్ల నిర్మాణంలో వేగవంతమైన పురోగతి కనిపిస్తోంది. మొత్తం ఎనిమిది స్టేషన్లకు పునాది నిర్మాణ పనులు పూర్తయ్యాయి, సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఐదు స్టేషన్లు-వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్- వాటి రైలు స్థాయి స్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి.
వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో కాంకోర్స్ స్థాయి మరియు రైలు స్థాయి స్లాబ్‌లు పూర్తయ్యాయి.
ఇతర స్టేషన్లను పరిశీలిస్తే.. భరూచ్ : 425 మీటర్లలో 350 మీటర్ల రైలు లెవల్ స్లాబ్ పూర్తయింది.
వడోదర : మొదటి అంతస్తు స్లాబ్‌కు సంబంధించిన కాస్టింగ్ పనులు జరుగుతున్నాయి.
సబర్మతి : మొత్తం తొమ్మిది మొదటి అంతస్తు స్లాబ్‌లు పూర్తయ్యాయి. తొమ్మిది కాన్కోర్స్ లెవల్ స్లాబ్‌లలో మూడు పూర్తయ్యాయి.
టికెటింగ్, వెయిటింగ్ ఏరియాలు, బిజినెస్ క్లాస్ లాంజ్‌లు, నర్సరీలు, రెస్ట్‌రూమ్‌లు, ఇన్ఫర్మేషన్ బూత్‌లు, రిటైల్ సెంటర్‌లు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్, అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లతో సహా ప్రయాణీకులకు అధునాతన సౌకర్యాలను అందించడానికి స్టేషన్‌లను తీర్చదిద్దుతున్నారు. అదనంగా, కొన్ని స్టేషన్‌లు మెరుగైన, వేగవంతమైన, అవాంతరాలు లేని కనెక్టివిటీని అందించడానికి ఆటోలు, బస్సులు, టాక్సీల వంటి బహుళ రవాణా మార్గాలను అనుసంధానిస్తూ రవాణా కేంద్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు.
5 out of 8 Bullet Train stations in Gujarat have achieved rail level slab casting. Here is the latest report on Bullet Train stations construction from Gujarat. Read more here https://t.co/zTBojKwkAc pic.twitter.com/48RK9Q0iGD
— NHSRCL (@nhsrcl) July 12, 2024
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..