
Mumbai-Ahmedabad Bullet Train | వడివడిగా బుల్లెట్ ట్రైన్ పనులు.. 508 కి.మీ పరిధిలో 12 స్టేషన్లు..
Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్ పరిధిలోసబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా వాపి స్టేషన్లను నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో బోయిసర్, విరార్, థానే, ముంబై లో స్టేషన్లు ఉన్నాయి.ఇటీవలి నివేదికలు గుజరాత్‌లో బుల్లెట్ రైలు స్టేషన్ల నిర్మాణంలో వేగవంతమైన పురోగతి కనిపిస్తోంది. మొత్తం ఎనిమిది స్టేషన్లకు పునాది నిర్మాణ పనులు పూర్తయ్యాయి, సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఐదు స్టేషన్లు-వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్- వాటి రైలు స్థాయి స్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి.వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో కాంకోర్స్ స్థాయి...