Home » Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం
Kazipet RUR

Kazipet RUR | దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేటలో విప్లవాత్మక నిర్మాణం

Spread the love

Kazipet RUR : దక్షిణ భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టిసారి ద‌క్షిణ మ‌ధ్య రైల్వే ప‌రిధిలోని కాజీపేట‌లో 340 మీటర్ల పొడవు గల రైలు-అండర్-రైల్ (RUR) నిర్మాణ ప‌నుల‌ను చేపడుతోంది. ఈ సొరంగం రెండు రైళ్లను ఒకేసారి వాటి మార్గంలో సాఫీగా వెళ్లిపోయేలా చేస్తుంది. ఒక రైలు ఉపరితలంపై.. మ‌రో రైలు దాని కింద నుంచి ప్రయాణిస్తుంది. ఇలాంటి త‌ర‌హా నిర్మాణం దక్షిణ మధ్య రైల్వే (SCR) జోన్‌లో మొట్ట‌మొదటిది. ఈ రైల్ అండ‌ర్ రైల్ నిర్మాణం.. విజయవాడ-బల్హర్షా సెక్షన్ ద్వారా న్యూదిల్లీ వైపు వెళ్లే రైళ్ల రాక‌పోక‌ల‌ను క్రమబద్ధీకరించడానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.

కాజీపేటలోని రైల్ అండర్ రైల్ (RUR) ఈ ప్రాంతంలో రైల్వేలో విప్లవాత్మక మార్పులకు సిద్ధంగా ఉంది. రైల్వే ప‌రంగా ఉత్త‌ర‌, ద‌క్షిణ భార‌త్ ల‌ను క‌లిపే కీల‌క మార్గంలో కాజీపేట సెక్ష‌న్ ప్ర‌ధాన‌మైన‌ది. న్యూదిల్లీ, చెన్నై, బెంగళూరు. చండీగఢ్, రాయపూర్, జబల్పూర్, లక్నో, గోరఖ్ పూర్, త్రివేండ్రం, బిలాసపూర్, బోధ్పూర్, జైపూర్. పాట్నాలతో సహా భారతదేశంలోని ప్రధాన నగరాలకు ప్రయాణించే రైళ్లను ఈ మార్గం నిర్వహిస్తుంది. ఈ విస్తృతమైన నెట్ వ‌ర్క్ దేశంలోని ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలుపుతుంది. అయితే, ప్యాసింజ‌ర్‌, గూడ్స్ రైళ్ల‌ రాకపోకలు ఇటీవ‌ల కాలంలో విప‌రీతంగా పెరిగిపోవ‌డంతో ర‌ద్దీ కూడా భారీగా పెరిగిపోయింది. ఫ‌లితంగా ఈ మార్గంలో రైళ్ల వేగం తగ్గింది. ఈ స‌మ‌స్య‌ల‌ను RUR ప్రాజెక్ట్ బైపాస్ నిర్మాణాన్ని సృష్టించడం ద్వారా ఈ సమస్యను నివారించ‌డానికి భార‌తీయ రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది.

READ MORE  Karimnagar New Railway Line | క‌రీంన‌గ‌ర్ - హ‌న్మ‌కొండ జిల్లాల‌ను క‌లుపుతూ కొత్త రైల్వే లేన్‌

“రాబోయే మూడు నెలల్లో RUR నిర్మాణం పూర్తి కానున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.  ఈ మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంలో ఈ ప్రాజెక్ట్ కీలకం చాలా వరకు సొరంగం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. తదుపరి దశలో డబుల్ లైన్లు వేయడం జరుగుతుంది” అని రైల్వే సీనియర్ అధికారి ఒకరు వివరించారు.

భవిష్యత్తు ప్రయోజనాలు

Kazipet RUR ప్రాజెక్ట్ ₹125 కోట్ల బడ్జెట్తో 21.47 రూట్ కిలోమీటర్లు విస్తరించి ఉన్న పెద్ద బైపాస్ లైన్లో భాగం. ఈ ప్రాంతంలో రైలు రాకపోకలను విప్లవాత్మకంగా మార్చేందుకు, ప్రస్తుత రద్దీ సమస్యలకు కీలకమైన పరిష్కారాన్ని అందించడంతోపాటు రైల్వే నెట్ వర్క్ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఆర్ యూ ఆర్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ ప్రాజెక్ట్ విజయవంతంగా పూర్తి కావడం దక్షిణ భారతదేశంలో రైలు మౌలిక సదుపాయాల పురోగతిలో ఒక కీలకమైన మైలురాయిగా నిలవనుంది.

READ MORE  New Ration Cards : రైతు బంధు, కొత్త రేషన్ కార్డుల జారీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..