
Indian Railways | ఎక్స్ ప్రెస్ రైళ్లలలో జనరల్ కంపార్ట్‌మెంట్ల ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండడంతో ఇటీవల కాలంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కనీసం కాలు కూడా పెట్టడానికి స్థలం ఉండడం లేదు.. పండుగలు, సెలవుల వేళల్లో జనరల్ టికెట్ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వాష్ రూంలలో కూడా నిల్చుని ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా స్లీపర్, ఏసీ బోగీల్లో కూడా ఎక్కుతున్నారు. దీంతో సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సుదూరం ప్రయాణించే రైళ్లలో నాలుగు అదనపు కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. సెంట్రల్ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి సుమారు 180 లాంగ్ జర్నీ రైళ్లను నడుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే 84 రైళ్లలో 4 జనరల్ క్లాస్ కోచ్‌లను జతచేస్తున్నారు. 84 రైళ్ల జాబితాలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, విదర్భ ఎక్స్‌ప్రెస్, అమృతసర్ ఎక్స్‌ప్రెస్, చెన్నై ఎక్స్‌ప్రెస్, సాకేత్ ఎక్స్‌ప్రెస్ మరియు కొచ్చువేలి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వంటి ప్రముఖ మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఉన్నాయి.
బంగ్లాదేశ్‌కు రైళ్లు రద్దు..
పొరుగు దేశం బంగ్లాదేశ్ లోని ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో భారతీయ రైల్వే (Indian Railways ) బంగ్లాదేశ్‌కు అన్ని రైళ్ల రాకపోకలను నిలిపివేసింది. షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసి, విద్యార్థుల నిరసనల మధ్య దేశం విడిచి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ (13109/13110), కోల్‌కతా-ఢాకా-కోల్‌కతా మైత్రీ ఎక్స్‌ప్రెస్ (13107/13108), కోల్‌కతా-ఖుల్నా-కోల్‌కతా బంధన్ ఎక్స్‌ప్రెస్, ఢాకా-న్యూ జల్పాయిగురి-ఢాకా మితాలీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..