
Ganesh Chaturthi Special Trains | గణేష్ చతుర్థి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో ఉత్సవాలు అంబరాన్నంటనున్నాయి. అయితే ఈ పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 222 ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ గణపతి ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా పశ్చిమ రైల్వే కూడా ముంబై నుంచి కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ రైళ్లు ముందస్తు బుకింగ్ కోసం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైళ్లు ముంబై సెంట్రల్ థోకూర్, సావంత్‌వాడి రోడ్, బాంద్రా టెర్మినస్, కుడాల్ నుంచి నడుస్తాయి.
Ganesh Chaturthi Special Trains : ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా
ముంబై-రత్నగిరి ప్రత్యేక రైలు
సెప్టెంబర్ 6, 7, 13, 14: LTT ముంబై-రత్నగిరి బై-వీక్లీ స్పెషల్ ట్రైన్ (8 సర్వీసులు) – 01031 LTT ముంబై నుండి 08:00కి బయలుదేరి మరుసటి రోజు 04:50కి రత్నగిరికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 7, 8, 14, 15: 01032 రత్నగిరి నుంచి 08:40కి బయలుదేరి అదే రోజు 17:15కి LTT ముంబైకి చేరుకుంటుంది, థానే, పన్వెల్, పెన్, రోహా, మాంగావ్, వీర్, కరంజాడి, ఖేడ్, చిప్లున్, సవార్దా, ఆరావళి రోడ్, మరియు సంగమేశ్వర్ రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.
పన్వేల్-రత్నగిరి వీక్లీ ప్రత్యేక రైలు
సెప్టెంబర్ 8, 15: 01443 పన్వెల్ 04:40కి బయలుదేరి అదే రోజు 11:50కి రత్నగిరికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 7, 14: 01444 రత్నగిరి నుంచి 17:50కి బయలుదేరి మరుసటి రోజు 01:30కి పన్వెల్ చేరుకుంటుంది, పెన్, రోహా, మాంగావ్, వీర్, కరంజాడి, ఖేడ్, చిప్లూన్, సవార్దా, ఆరావళి రోడ్ మరియు సంగమేశ్వర్ రోడ్‌లో ఆగుతుంది.
పూణే-రత్నగిరి వీక్లీ ప్రత్యేక రైలు
సెప్టెంబర్ 7, 14: 01447 00:25కి పూణేలో బయలుదేరి అదే రోజు 11:50కి రత్నగిరికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 8, 15: 01448 రత్నగిరి నుండి 17:50కి బయలుదేరి మరుసటి రోజు 17:00 గంటలకు పూణే చేరుకుంటుంది, చించ్‌వాడ్, తలేగావ్, లోనావాలా, కళ్యాణ్, పన్వేల్, పెన్, రోహా, మాంగావ్, వీర్, కరంజాడి, ఖేడ్, చిప్లున్, సవార్దా ఆరావళి రోడ్, సంగమేశ్వర్ రోడ్ స్టేషన్లలో ఆగుతుంది.
పన్వేల్-రత్నగిరి ప్రత్యేక రైలు
సెప్టెంబర్ 11: 01441 పన్వెల్ నుంచి 16:40కి బయలుదేరి అదే రోజు 11:50కి రత్నగిరికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 10: 01442 రత్నగిరి నుంచి 17:50కి బయలుదేరి మరుసటి రోజు 13:30కి పన్వెల్ చేరుకుంటుంది, పెన్, రోహా, మాంగావ్, వీర్, కరంజాడి, ఖేడ్, చిప్లూన్, సవార్దా, ఆరావళి రోడ్, సంగమేశ్వర్ రోడ్‌లో ఆగుతుంది.
పూణే-రత్నగిరి వీక్లీ ప్రత్యేక రైలు
సెప్టెంబర్ 10: 01445 పూణెలో 00:25కి బయలుదేరి అదే రోజు 11:50కి రత్నగిరికి చేరుకుంటుంది.
సెప్టెంబర్ 11: 01446 రత్నగిరి నుండి 17:50కి బయలుదేరి, మరుసటి రోజు 05:00 గంటలకు పూణే చేరుకుంటుంది, చించ్‌వాడ్, తలేగావ్, లోనావాలా, కళ్యాణ్, పన్వెల్, పెన్, రోహా, మంగావ్, వీర్, కరంజాడి, ఖేడ్, చిప్లున్, సవర్దా, ఆరావల్లి రోడ్, సంగమేశ్వర్ రోడ్ లో ఆగుతుంది.
బాంద్రా టెర్మినస్ – కుడాల్ – బాంద్రా టెర్మినస్ వీక్లీ స్పెషల్ (09015/09016)
రైలు నంబర్ 09015 గురువారం (సెప్టెంబర్ 5,12, 19) నడుస్తుంది. ఇది బాంద్రా టెర్మినస్ నుండి మధ్యాహ్నం 2:40 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:40 గంటలకు కుడాల్ చేరుకుంటుంది. రైలు నంబర్ 09016 కుడాల్ నుండి శుక్రవారం (సెప్టెంబర్ 6, 13, 19) నడుస్తుంది. ఇది కుడాల్ నుంచి ఉదయం 6:45 గంటలకు బయలుదేరి అదే రోజు రాత్రి 9:30 గంటలకు బాంద్రా టెర్మినస్‌కు చేరుకుంటుంది.
Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..