Indian Railways | ప్రయాణికులకు గుడ్ న్యూస్ | 84 ఎక్స్ ప్రెస్ రైళ్లకు అదనంగా నాలుగు జనరల్ కోచ్ లు..
Indian Railways | ఎక్స్ ప్రెస్ రైళ్లలలో జనరల్ కంపార్ట్‌మెంట్ల ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండడంతో ఇటీవల కాలంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కనీసం కాలు కూడా పెట్టడానికి స్థలం ఉండడం లేదు.. పండుగలు, సెలవుల వేళల్లో జనరల్ టికెట్ ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వాష్ రూంలలో కూడా నిల్చుని ప్రయాణిస్తున్నారు. అంతేకాకుండా స్లీపర్, ఏసీ బోగీల్లో కూడా ఎక్కుతున్నారు. దీంతో సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా సుదూరం ప్రయాణించే రైళ్లలో నాలుగు అదనపు కోచ్‌లను చేర్చాలని నిర్ణయించింది. సెంట్రల్ రైల్వే ప్రతిరోజూ దేశవ్యాప్తంగా వివిధ నగరాల నుంచి సుమారు 180 లాంగ్ జర్నీ రైళ్లను నడుపుతున్నట్లు ఒక అధికారి తెలిపారు. అయితే 84 రైళ్లలో 4 జనరల్ క్లాస్ కోచ్‌లను జతచేస్తున్నారు. 84 రైళ్ల జాబితాలో కోణార్క్ ఎక్స్‌ప్రెస్, విదర్భ ఎక్స్‌ప్రెస్, అ...