Yadadri Brahmotsavam 2024 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 11న సోవారం నుంచి 21 వరకు వైభవంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు మంత్రులు పాల్గొననున్నారు.
ఈ నెల 11న స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేరాధన, రక్షాబంధనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో ఉత్సవాలు సంపూర్ణం కానున్నాయి. కాగా 17న ఎదుర్కోలు, 18న స్వామివారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20వ తేదీన మహాపూర్ణాహుతి, చక్రతీర్థం నిర్వహిస్తారు. 10 రోజులు సాగే ఈ ఉత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. 18న ప్రధానాలయ ఉత్తర ప్రాంతంలోని వాయు దిశలో నిర్మించిన లిప్టు, రథ శాల ప్రాంతంలో కల్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమాలు, మొక్కు సేవలను అధికారులు రద్దు చేయనున్నారు.
Yadadri Brahmotsavam 2024
[table id=19 /]
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..