Vande Bharat Trains | ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలు అందుబాటులోకి తీసుకొస్తోంది భారతీయ రైల్వే.. ఈ నెల 12న ప్రధాని నరేంద్ర మోదీ కొత్తగా 10 వందేభారత్ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు.
Vande Bharat Trains From Secunderabad To Visakha: ఇండియన్ రైల్వేస్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులు గుడ్ న్యూస్ చెప్పింది. సికింద్రాబాద్ (Secunderabad) నుంచి విశాఖ పట్నానికి (Visakha) కొత్తగా వందే భారత్ రైళ్లను నడిపించనుది. భువనేశ్వర్ – విశాఖ – భువనేశ్వర్ కు కూడా వందేభారత్ రైళ్లను మంజూరు చేసింది. ఈ నెల 12న మంగళవారంప్రధాని మోదీ ఈ రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించనున్నారు. తెలంగాణ, ఏపీలో సికింద్రాబాద్, విశాఖకు ఇప్పటికే ఒక వందే భారత్ రైలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ తొలి వందే భారత్ 2023 జనవరి 15 నుంచి సేవలందిస్తోంది. ఈ రైలు ఉదయం 5:45 గంటలకు విశాఖ నుంచి బయలు దేరి మధ్యాహ్నం 2:15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుని తిరిగి 3 గంటలకు బయలు దేరి రాత్రి 11:30 గంటలకు వైజాగ్ కు చేరుతుంది. ఈ రైలుకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. వంద శాతం ఆక్యుపెన్సీతో రిజర్వేషన్ సైతం లభించడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రయాణికులకు మేలు కలిగించేందుకు ఈ రెండు నగరాలమ మధ్య మరో వందేభారత్ రైలును నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. అయితే ప్రస్తుతం విశాఖ – సికింద్రాబాద్ – విశాఖ వందేభారత్ 16 బోగీలతో నడుస్తుండగా.. కొత్తగా ప్రవేశపెట్టే రైలును కేవలం 8 బోగీలతో మాత్రమే నడపనున్నారు.
కొత్త వందే భారత్ టైమింగ్స్ ఇవే..
సికింద్రాబాద్ నుంచి విశాఖకు మరో వందేభారత్ రైలుకు భారతీయ రైల్వే శాఖ ఆమోదం తెలపగా.. త్వరలోనే ఈ రైలు కూడా పట్టాలెక్కనుంది. ట్రైన్ నెంబర్ 20707 /20708 సికింద్రాబాద్ – విశాఖ – సికింద్రాబాద్ రైలు గురువారం మినహా మిగతా అన్ని రోజుల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ప్రతీ రోజూ ఉదయం 5:05 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1:50 గంటలకు విశాఖ స్టేషన్ కు చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 2:35 గంటలకు బయల్దేరి రాత్రి 11:20కి సికింద్రాబాద్ కు చేరుకుంటుంది. ఈ వందేభారత్ రైలు తెలంగాణలోని వరంగల్, ఖమ్మం.. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, రాజమహేంద్రవరం, సామర్లకోట స్టేషన్లలో నిలుస్తుంది.
పూరీ – విశాఖ – పూరీకి వందేభారత్
విశాఖ నుంచి ఒడిశాలోని పూరీకి వందేభారత్ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు (20841/ 20842) శనివారం మినహా మిగిలిన అన్ని రోజులు పరుగులు పెట్టనుంది. ప్రతిరోజూ ఉదయం 5:15 గంటలకు పూరీ స్టేషన్‌లో బయలుదేరి ఉదయం 11:30 గంటలకు విశాఖకు చేరుకుంటుంది. తిరిగి విశాఖ నుంచి మధ్యాహ్నం 3:40 గంటలకు బయలుదేరి రాత్రి 9:55 గంటలకు పూరీకి వస్తుంది. అయితే ఈ రైలుకు 8 బోగీలు ఉంటాయి. 443 కిలో మీటర్ల దూరాన్ని సుమారు కేవలం 5 గంటల్లోనే చేరుకుంటుంది. విశాఖ నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తునన వందేభారత్ రైలులో ఉండే ఛార్జీలే ఈ కొత్త రైలుకు వర్తింపచేస్తారని వాల్తేరు రైల్వే అధికారులు వెల్లడించారు.
ఏ స్టేషన్ కి ఎప్పుడు వస్తుంది..
పూరీ నుంచి విశాఖకు నడిచే వందేభారత్ రైలు ఖుర్దా రోడ్ (ఉదయం 5:33 గంటలకు), బరంపూర్ (ఉదయం 7:05 గంటలకు), ఇచ్ఛాపురం (ఉదయం 7:18 గంటలకు), పలాస (ఉదయం 8:18 గంటలకు), శ్రీకాకుళం రోడ్ (ఉదయం 9:03 గంటలకు), విజయనగరం (ఉదయం 09:48 గంటలకు)స్టేషన్లలో ఆగుతుంది. అలాగే, విశాఖ నుంచి పూరీ వెళ్లే వందేభారత్ రైలు విశాఖలో మధ్యాహ్నం 03:45 గంటలకు బయలుదేరి 4:30 గంటలకు విజయనగరం స్టేషన్ కు చేరుతుంది. అలాగే సాయంత్రం 5:28 గంటలకు శ్రీకాకుళం రోడ్, 6:30 గంటలకు పలాస, రాత్రి 7 గంటలకు ఇచ్ఛాపురం, 7:20 గంటలకు బరంపూర్, రాత్రి 8:57 గంటలకు ఖుర్దారోడ్, రాత్రి 9:30 గంటలకు భువనేశ్వర్ స్టేషన్ చేరుకుంటుందని అధికారులు తెలిపారు. అలాగే ఈ రైలు ప్రతీ స్టేషన్ లో ఈ రైలు 2 నిమిషాల పాటు ఆగుతుందని అధికారులు తెలిపారు.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..