Dwarka Expressway | గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని వల్ల ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి — ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి బసాయి ROB (10.2 కి.మీ), అలాగే బసాయి ROB నుండి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) (8.7 కి.మీ) వరకు. దీనిని దాదాపు రూ.4,100 కోట్లతో 19 కిలోమీటర్ల మేర ఈ సెక్షన్‌ను నిర్మించారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలు
- Dwaraka Expressway Features : ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోని మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే. ఎనిమిది లేన్‌లతో కూడిన మొదటి సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్. దాదాపు రూ.9 వేల కోట్లతో మొత్తం స్ట్రెచ్‌ను నిర్మిస్తున్నారు.
- ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో దాదాపు 19 కిలోమీటర్లు హర్యానాలో ఉండగా, మిగిలిన 10 కిలోమీటర్లు ఢిల్లీలో ఉన్నాయి.
- హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే ఢిల్లీ-గురుగ్రామ్ ఎక్స్‌ప్రెస్‌వేపై శివ్-మూర్తి నుండి ప్రారంభమవుతుంది.. ఖేర్కి దౌలా టోల్ ప్లాజా దగ్గర ముగుస్తుంది, ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 21, గురుగ్రామ్ సరిహద్దు.. బసాయి గుండా వెళుతుంది.
- ఇది సొరంగాలు లేదా అండర్‌పాస్‌లు, అట్-గ్రేడ్ రోడ్ సెక్షన్, ఎలివేటెడ్ ఫ్లైఓవర్, ఫ్లైఓవర్ పైన ఫ్లైఓవర్ వంటి నాలుగు మల్టీ లెవల్ ఇంటర్‌ఛేంజ్‌లను కలిగి ఉంటుంది.
- 9 కిలోమీటర్ల పొడవు, 34 మీటర్ల వెడల్పుతో ఒకే పిల్లర్‌పై ఎనిమిది లేన్‌ల ఎలివేటెడ్ రోడ్డు దేశంలోనే మొదటిది.
- భారతదేశంలోని అతి పొడవైన (3.6 కిలోమీటర్లు), విశాలమైన (ఎనిమిది లేన్లు) పట్టణ రహదారి సొరంగం కూడా ఉంది. పూర్తయిన తర్వాత, ఇది ఢిల్లీలోని ద్వారకా సెక్టార్ 25లో రాబోయే ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (IICC)కి నేరుగా యాక్సెస్‌ను అందిస్తుంది.
- ఈ ఎక్స్‌ప్రెస్‌వే సొరంగం ద్వారా ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రత్యామ్నాయ మార్గంగా ఉంటుంది.
- ఇది గురుగ్రామ్ జిల్లాలో ప్రతిపాదిత గ్లోబల్ సిటీతో పాటు ద్వారకా సెక్టార్‌లు – 88, 83, 84, 99, 113 సెక్టార్-21తో కలుపుతుంది.
- Dwarka Expressway అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. టోల్ వసూలు పూర్తిగాా ఆటోమెటిక్ విధానంలో ఉంటుంది. మొత్తం ప్రాజెక్ట్ సమర్ధవంతమైన రవాణా వ్యవస్థ (ITS)తో అమర్చబడుతుంది.
- నాలుగు దశల్లో దీన్ని ప్రణాళికాబద్ధంగా నిర్మిస్తున్నారు. మొదటిది, ఢిల్లీ ప్రాంతంలో మహిపాల్‌పూర్‌లోని శివమూర్తి నుండి బిజ్వాసన్ (5.9 కిమీ). రెండవది బిజ్వాసన్ ROB నుంచి గురుగ్రామ్‌లోని ఢిల్లీ-హర్యానా సరిహద్దు వరకు (4.2 కిమీ). మూడవది హర్యానా ప్రాంతంలో ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుంచి బసాయి ROB వరకు (10.2 కిమీ వరకు). ). ఇక నాల్గవది బసాయి ROB నుండి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) వరకు (8.7 కి.మీ).
మొత్తం నిర్మాణం కోసం, 2 లక్షల మెట్రిక్ టన్నుల ఉక్కు (ఈఫిల్ టవర్‌లో ఉపయోగించిన ఉక్కు కంటే 30 రెట్లు) ఎక్కువ. 20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీటు (బుర్జ్ ఖలీఫాలో ఉపయోగించిన కాంక్రీటు కంటే 6 రెట్లు) ఎక్కవగా వినియోగిస్తున్నారని అంచనా.
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..