
Dwarka Expressway | ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభమైంది… అబ్బరపరిచే దీని ప్రత్యేకతలు మీకు తెలుసా..
Dwarka Expressway | గురుగ్రామ్‌లో ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వేలోని హర్యానా సెక్షన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ప్రారంభించారు. ఎనిమిది లేన్ల హై-స్పీడ్ ఎక్స్‌ప్రెస్‌వే భారతదేశపు మొట్టమొదటి ఎలివేటెడ్ హైవే ఇది. దీనిని వల్ల ఢిల్లీ, గురుగ్రామ్ మధ్య ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అత్యంత సులభమైన ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. ఈ ఎక్స్ ప్రెస్ హైవే హర్యానా విభాగంలో రెండు ప్యాకేజీలు ఉన్నాయి -- ఢిల్లీ-హర్యానా సరిహద్దు నుండి బసాయి ROB (10.2 కి.మీ), అలాగే బసాయి ROB నుండి ఖేర్కి దౌలా (క్లోవర్‌లీఫ్ ఇంటర్‌చేంజ్) (8.7 కి.మీ) వరకు. దీనిని దాదాపు రూ.4,100 కోట్లతో 19 కిలోమీటర్ల మేర ఈ సెక్షన్‌ను నిర్మించారు.
ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే ప్రత్యేకతలుDwaraka Expressway Features : ఈ ఎక్స్‌ప్రెస్‌వే దేశంలోని మొట్టమొదటి ఎలివేటెడ్ అర్బన్ ఎక్స్‌ప్రెస్ వే. ఎనిమిది లేన్‌లతో కూడిన మొదటి సింగిల్ పిల్లర్ ఫ్లైఓవర్. దాదాపు రూ.9...