Posted in

Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..

Western Railway Digital Display Boards
Spread the love

Western Railway : పశ్చిమ రైల్వే (WR) “ముంబై ప్రయాణిల కోసం “లోకల్ రైలు కోచ్‌ల సైడ్ ప్యానెల్‌లపై అత్యాధునికమైన డైనమిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Panorama Digital Display Board) లను ఏర్పాటు చేసింది. ఈ వినూత్న డిస్ల్పేలతో ప్రయాణికులకు లోకల్ రైలు గమ్యస్థానాల వివరాలు స్పష్టంగా, వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఇది ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో మరింత సౌకర్యవంతంగా మార్చేసిందని WR యొక్క కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు.

రైళ్ల రాకపోకలకు సంబంధించిన  కీలకమైన సమాచారం అందించడానికి ఒక రేక్‌పై ఎనిమిది డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రతి వైపు నాలుగు అమర్చబడి ఉన్నాయని ఆయన చెప్పారు. డిజిటల్ డిస్‌ప్లేలు రైలు గమ్యస్థానాల వివరాలు  ఇంగ్లీష్, హిందీ,  మరాఠీలో చూపుతాయని, మూడు సెకన్ల వ్యవధిలో మారిపోతాయని తెలిపారు.

వీటిపై ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, సమీప భవిష్యత్తులో ఇతర రేక్‌లలో డిస్‌ప్లే బోర్డులను ఇన్‌స్టాల్ చేయడానికి Western Railway ప్లాన్ చేస్తుందని వీనిత్ అభిషేక్ తెలిపారు. ఇదిలా ఉండగా పశ్చిమ రైల్వే ప్రతిరోజూ 1,300 కంటే ఎక్కువ సబర్బన్ రైల్వే సర్వీసులను  నిర్వహిస్తోంది. దక్షిణ ముంబైలోని చర్చ్‌గేట్,  మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలోని దహను మధ్య విస్తరించిన ఈ  నెట్‌వర్క్‌లో సుమారు 30 లక్షల మంది  ప్రయాణిస్తున్నారు.

  • డిజిటల్ డిస్ప్లేలు పూర్తి HD TFT (థిన్ ఫిల్మ్ ట్రాన్సిస్టర్) తో రూపొందించారు.
  • ఎండ, వాన నుంచి రక్షించేందుకు డిస్ప్లేలకు  కఠినమైన గ్లాస్   రక్షణగా ఉంటుంది.
  • ప్రజలు స్క్రీన్‌లపై వివరాలను స్పష్టంగా కనిపించేలా సరైన బ్రైట్ నెస్, & వ్యూయింగ్ యాంగిల్స్ ను కలిగి ఉంటాయి.
  • డిస్ప్లే స్క్రీన్‌ల కాంట్రాస్ట్ సెన్సార్ల ద్వారా ఆటోమెటిక్ గా  నియంత్రించబడుతుంది, తద్వారా టెక్స్ట్ 5 మీటర్ల దూరం నుండి కూడా స్పష్టంగా కనిపిస్తుంది
  • డిస్ప్లేలు 5 మిమీ మందం గల పాలికార్బోనేట్ షీట్‌తో రక్షించబడ్డాయి
  • రైలు కదులుతున్నపుడు వైబ్రేషన్ కారణంగా డిస్‌ప్లే పడిపోకుండా నిరోధించడానికి స్ప్లిట్ పిన్ అమరికతో లాక్ చేశారు.


Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్రను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News) తోపాటు ఎక్స్ (X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..
Whatsapp

కిర‌ణ్ పొడిశెట్టి వందేభారత్ లో కొన్నేళ్లుగా న్యూస్ కంటెంట్ ప్రొవైడ్ గా ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయం, అంత‌ర్జాతీయ అంశాల‌తోపాటు టెక్నాల‌జీ, లైఫ్‌స్టైల్‌ కు సంబంధించిన తాజా వార్తల‌ను అందిస్తుంటారు. జర్నలిజంలో ఆయ‌న‌కు 17 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్ర‌జ్యోతి, సాక్షి స‌హా వివిధ ప్ర‌ముఖ‌ ప‌త్రిక‌ల్లో సీనియ‌ర్‌ స‌బ్ఎడిట‌ర్‌గా ప‌నిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *