
Western Railway : లోకల్ రైళ్లకు ఆకర్షణీయమైన డైనమిక్ డిజిటల్ డిస్ల్పే బోర్డులు..
Western Railway : పశ్చిమ రైల్వే (WR) "ముంబై ప్రయాణిల కోసం "లోకల్ రైలు కోచ్‌ల సైడ్ ప్యానెల్‌లపై అత్యాధునికమైన డైనమిక్ డిజిటల్ డిస్‌ప్లే బోర్డు (Panorama Digital Display Board) లను ఏర్పాటు చేసింది. ఈ వినూత్న డిస్ల్పేలతో ప్రయాణికులకు లోకల్ రైలు గమ్యస్థానాల వివరాలు స్పష్టంగా, వెంటనే గుర్తించేలా చేస్తుంది. ఇది ముంబై సబర్బన్ నెట్‌వర్క్‌లో మరింత సౌకర్యవంతంగా మార్చేసిందని WR యొక్క కొత్త చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ వినీత్ అభిషేక్ ఒక ప్రకటనలో తెలిపారు.రైళ్ల రాకపోకలకు సంబంధించిన కీలకమైన సమాచారం అందించడానికి ఒక రేక్‌పై ఎనిమిది డిజిటల్ డిస్‌ప్లేలు, ప్రతి వైపు నాలుగు అమర్చబడి ఉన్నాయని ఆయన చెప్పారు. డిజిటల్ డిస్‌ప్లేలు రైలు గమ్యస్థానాల వివరాలు ఇంగ్లీష్, హిందీ, మరాఠీలో చూపుతాయని, మూడు సెకన్ల వ్యవధిలో మారిపోతాయని తెలిపారు.వీటిపై ప్రయాణీకుల నుంచి సానుకూల స్పందన లభించిందని, సమీప భవిష్యత్తులో ఇతర...