Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope : ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది?

Weekly Horoscope :  ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జనవరి  7 ఆదివారం నుంచి జనవరి 13 వరకు వారంలో రాశిఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్ర నిపుణులు సుమన్ శర్మ ఈ వివరాలను అందించారు.

మేష రాశి

Horoscope Today మేష రాశి వారికి ఈ వారంలో వ్యర్థ సంచారము చేయవలసి వస్తుంది. దైవానుగ్రహం ఉంటుంది. దాంపత్య పరమైన సౌఖ్యం ఉంటుంది. స్త్రీ అలంకరణ వస్తువుల వ్యాపారస్తులకు సంతృప్తికరమైన ఆదాయం ఉం టుంది. బ్యాంక్ లోన్స్ మంజూరు అవుతాయి. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. అజీర్ణం ఒక సమస్యగా మారుతుంది. తండ్రితో చర్చలు నిర్వహిస్తారు. గృహము నందు శుభకార్యం నిర్వహించే అవకాశం కలదు. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకూడదు. అకారణ వైరంకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు అధికమైన పని భారము ఉండను. కొన్ని విషయాలలో మొండితనంతో అనుకున్నది సాధిస్తారు. విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి. దుర్గా దేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

వృషభ రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో శుభకార్యాల నిమిత్తం అధిక ధనవ్యయము చేయవ లసి వస్తుంది. విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితి మరియు విదేశీయాన ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవు తుంది. స్థిరంగా నిర్ణయాలు తీసుకుంటారు. స్త్రీలతో కలహం అంత మంచిది కాదు. పోలీసు శాఖ ఉద్యోగస్తులు అధికారుల ఆగ్రహానికి గురవు తారు. డెయిరీ ప్రొడక్ట్, బియ్యం వ్యాపారస్తులకు ఇబ్బందులు ఉండును. శారీరక సౌఖ్యం ఉంటుంది. ఎడమ వైపు కంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. మీ ఎదుగుదలను చూసి తల్లితండ్రుల ఆనందిస్తారు. వివాహ ప్రయత్న విషయమై శుభవార్త వింటారు. దూరప్రాత ప్రయాణములు వాయిదా వేసుకోవడం చెప్పదగిన సూచన. శరీరానికి గాయాలయ్య అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. వృత్తిరీత్యా పనులు ఆలస్యం అవుతాయి. ధనపరమైన వెసులుబాటు ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదైన సూచన.

మిధున రాశి

మిధున రాశి వారికి ఈ వారంలో విద్యార్థులు అనుకున్న లక్ష్యానికి చేరుకుంటారు. తల్లి ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. మీ జీవిత భాగస్వామికి చర్మ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. మీ మాట చెల్లుబాటు అవుతుంది. దేవాలయ దర్శనం చేస్తారు. చిట్ ఫండ్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. ప్రయాణాల వల్ల నష్టం చేకూరుతుంది. సోదరులతో అభిప్రాయ భేదములు ఏర్పడును. సంతాన ప్రయత్నం చేసే వారు శుభవార్త వింటారు. వారం చివరిలో మానసిక ఉల్లాసంతో కాలాన్ని కలుపుతారు. పంటి నొప్పితో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. తండ్రికి ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతాయి. బ్యాంకింగ్ రంగంలోని ఉద్యోగస్తులకు వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam 2024 | క్రోధి నామ ఉగాది పంచాంగం: కుంభ రాశి వారికి కొత్త సంవత్సరం ఫలితాలు ఎలా ఉన్నాయి..

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. మంచి మనసుతో ఇతరులకు సహాయం చేస్తారు. విద్యార్థులకు యోగ కాలము. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. రెస్టారెంట్ వ్యాపారస్తులకు నష్టము ఉండును. సంతాన భవిష్యత్తుపై కృషి చేస్తారు. ప్రయాణాలలో శరీరము సహకరించదు. సంస్థల విస్తరణ నిమిత్తమై వ్యాపార భాగస్వామితో చర్చలు నిర్వహిస్తారు. ఏ నిర్ణయం అయినా మొండితనంతో తీసుకుంటారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. ఆరోగ్యపరమైన శ్రద్ధ అవసరం. మధ్యవర్తిత్వం వలన నష్టపోతారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ వారంలో స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. అనవసరమైన ఖర్చులు మీద పడతాయి. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. కుటుంబ పరమైన సౌఖ్యం ఉంటుంది. పేయింట్ , హార్డ్ వేర్ వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉండును. బ్యాంకు లోన్స్ ఆలస్యం అవుతాయి. రైస్ మిల్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుతాయి. ముఖ్యమైన విషయాలు మర్చిపోకూడదు. సెంట్రల్ నెర్వస్ సిస్టంకు సంబంధించిన అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. సంతాన ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నూతన దంపతులు మనస్పర్ధలకు దూరంగా ఉండాలి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. వైద్య వృత్తిలో ఉన్నవారికి యోగ కాలము. భద్రకాళి అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

కన్య రాశి

కన్యా రాశి వారికి ఈ వారంలో విలువైన వస్తువులు జాగ్రత్త పరుచుకోవాలి. ఆరోగ్యపరమైన శ్రద్ధ వహించండి. వ్యాపారస్తులకు వ్యాపార భాగ్య స్వాముల వలన నష్టము కలిగే అవకాశాలు కలవు. బంధువులతో వైరం అంత మంచిది కాదు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు సానుకూలిస్తాయి. సోదరులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. సంకల్పిం చిన పనులు ఆలస్యం అవుతాయి. మానసిక ఆందోళనను ధైర్యంగా అధిగమించాలి. విద్యార్థులకు మిశ్రమమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తల్లికి అనారోగ్య సమస్యలు వచ్చును. ఎట్టి పరిస్థితులలోనూ అప్పు చేయకూడదు. రాజకీయరంగంలో ఉన్నవారు శత్రువుల మీద విజయం సాధిస్తారు. పోలీస్ శాఖ వారికి స్థానచలము కలిగే అవకాశాలు కలవు. మీ జీవిత భాగస్వామికి ఎముకలు మరియు కండరాలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చును. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

తులా రాశి

తుల రాశి వారికి ఈ వారంలో మీ జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఉంటుంది. అధికమైన ధన వ్యయం చేయవలసి వస్తుంది. విదేశీ ప్రయత్నాలు చేసే విద్యార్థులకు వీసా మంజూరు అవుతుంది. నూతన వ్యాపార ప్రారంభానికి అడుగులు పడతాయి. ఇరిగేషన్, రెవన్యూ ఉద్యోగస్తులకు సహ ఉద్యోగస్తులతో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో సరదాగా కాలాన్ని గడుపుతారు. అలంకారానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేసే అవకాశం కలదు. అసత్యం ఆడడం వల్ల ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. సోదరీ సోదరులతో స్థిరాస్తి పంచుకోవడం పై చర్చలు నిర్వహిస్తారు. నూతన వ్యక్తుల పరిచయాలు లభిస్తాయి. మీ సంతానానికి అనారోగ్య సమస్యలు వచ్చును. వెండి వెండి మరియు బంగారం వ్యాపారస్తులకు ఆర్థికపరమైన ఎదుగుదల ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Astrology Signs | ఈ వారంలో 12 రాశులవారికి శుభ ఫలితాలు ఇవే..

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరమైన ఇబ్బందులు పరిష్కార దిశగా సాగుతాయి. మధుమేహ వ్యాధితో ఇబ్బంది పడేవారు జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు ప్రతి పనిని క్రమ శిక్షణ పద్ధతిలో చేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. ఎవరితోనైనా స్నేహం చేసే ముందు ఆలోచించి చేయాలి. ఫుడ్ ఐటెం వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కడుపుకు సంబంధ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు కలవు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సరదాగా కాలాన్ని గడుపుతారు. విదేశీయాన ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. పోలీస్ శాఖలో ఉన్నవారికి స్థానచలనము కలిగే అవకాశాలు కలవు. మధ్యవర్తిత్వం వలన లాభపడతారు. కుటుంబ కలతలకు దూరంగా ఉండాలి. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఈశ్వర ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

ధనస్సు రాశి

ఈ రాశి వారికి ఈ వారంలో దైవానుగ్రహం ఉంటుంది. ఉన్న ఉద్యోగం విడిచిపెట్టి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయడం అంత మంచిది కాదు. దాంపత్య పరమైన సమస్యలు ఉండును. టెక్స్ టైల్ వ్యాపారస్తులకు నష్టములు ఉండును. విందు వినోదాలకై అధిక ఖర్చులు చేస్తారు. కుటుంబ సౌఖ్యము ఉంటుంది. ప్రభుత్వ ఆస్పత్రుల ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఇబ్బందులు ఉండును. సంకల్పించిన పనులు ఆలస్యమైనప్పటికీ పూర్తవుతాయి. వేళ తప్పిన భోజనం ఉంటుంది. చర్మ మరియు రక్త సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. విద్యార్థులు శ్రమ చేయవలసిన సమయం. సినిమా రంగంలో ఉన్నవారికి మీ శ్రమకి తగిన గుర్తింపు లభిస్తుంది. వాహనపరమైన ప్రమాదాలు జరిగే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారంలో నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. మీ జీవిత భాగస్వామితో ఉన్న మనస్పర్ధలు తొలుగుతాయి. ప్రింటింగ్ ప్రసెస్ వ్యాపారస్తులు తెలివితో అధిక లాభాలను పొందగలుగుతారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. మతిమరుపు వల్ల సమస్యలు వస్తాయి. రాజకీయరంగంలో ఉన్నవారు శత్రువులని కూడా చేరదీస్తారు. సినిమా రంగంలో ఉన్నవారికి అవకాశాలు చేయి జారిపోతాయి. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు. రక్షణ శాఖ ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. ఏ నిర్ణయం అయినా కుటుంబ సభ్యులతో చర్చించి తీసుకోవాలి. విదేశీ ప్రయత్నాలు చేసే వారికి వీసా మంజూరు అవుతుంది. ధనపరమైన ఇబ్బందులు తొలుగుతాయి. లలిత అమ్మవారి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

READ MORE  Ugadi Panchangam Simha Rasi Phalalu | క్రోధి నామ ఉగాది పంచాంగం: సింహ రాశి వారికి ఈ కొత్త ఏడాది మిశ్రమ ఫలితాలు..

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారంలో విదేశాలలో నివసించే ఒక స్నేహితుని సహాయం వల్ల ఒక సమస్య పరిష్కారం అవుతుంది. చర్మ సంబంధ అనారోగ్య సమస్యలకు ఔషధ సేవ చేయవలసి వస్తుంది. సంగీతము పట్ల ఆసక్తి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఫార్మసీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. షేర్స్ బిజినెస్ చేసేవారు నష్టపోతారు. సంకల్పించిన పనులు పూర్తవుతాయి. కుటుంబ సంతోషానికై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థిరాస్తుల వల్ల లాభం చేకూరుతుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. వివాహ ప్రయత్నాలు వాయిదా పడతాయి. మధ్యవర్తిత్వం వల్ల లాభం చేకూరుతుంది. శరీరం సహకరించకపోవడం వల్ల పనులు వాయిదా వేస్తారు. కోర్టు కేసులు లు వాయిదా పడతాయి. కొంతమేరకు అప్పుని తీర్చగలుగుతారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారంలో ఉన్నంతలో సంతృప్తి చెందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు వచ్చును. విద్యార్థులకు ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. కులవృత్తి చేసే వారికి యోగ కాలము. అసంతృప్తి భోజనము ఉంటుంది. ప్లాస్టిక్ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. దూర ప్రాంత ప్రయాణాలు వాయిదా పడతాయి. ప్రభుత్వంలో రవాణా శాఖలో పని చేసే వారికి అధిక పని భారం ఉంటుంది. కుటుంబ సభ్యులకు సంబంధించిన ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. అడ్మినిస్టేషన్ ఉద్యోగస్తులకు పదోన్నతులు ఉండును. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చెడు వ్యసనాల జోలికి పోకూడదు. ఉష్ణ సంబంధిత అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన విషయాలు అతిగా ఆలోచించకూడదు. దుర్గాదేవి ఆరాధన చేయడం చెప్పదగిన సూచన.

Weekly Horoscope By

స్వర్ణకంకణధారి, జ్యోతిష్య జ్ఞాన ప్రదీపక
డాక్టర్ కాళేశ్వరం సుమన్ శర్మ
7730023250, 8978510978


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *