
Astrology Signs | ఈ వారం రాశిఫలాలు..12 రాశులకు ఎలా ఉన్నదంటే?
Zodiac Sign | ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 మార్చి 31 ఆదివారం నుంచి ఏప్రిల్ 6 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి
( 31'st mar - 6'th Apr ) మేష రాశి వారికి ఈ వారంలో గృహము నందు civil repairs చేసే అవకాశాలు కలవు. తండ్రి కొరకు ధన వ్యయము చేయవలసి వస్తుంది. విద్యార్థులకు సత్ఫలితాలు ఉండును. మీ జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. బంగారము వ్యాపారస్తులు వ్యాపార భాగస్వాములతో జాగ్రత్తగా ఉండాలి. మంచి నిద్ర లేకపోవడం వల్ల ఇబ్బంది పడతారు. అనవసరమైన ప్రయాణాలు చేయకూడదు...