Ayodhya Ram Mandir | యావత్ భారతదేశంలో కోట్లాది హిందువుల కల నెరవేరే సమయం ఆసన్నమవుతోంది. జనవరి 22న అయోధ్య రామ మందిరం (Ayodhya Ram Mandir) విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవోపేతంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఈ వేడుకల కోసం కోదండరాముడి జన్మస్థానమైన అయోధ్యాపురి (Ayodhya) సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రామమందిరం ప్రారంభం, విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సమయం దగ్గర పడుతుండడంతో నిర్మాణ, సుందరీకరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.
న్యూస్ అప్ డేట్స్ కోసం వాట్సప్ చానల్ లో చేరండి
అయితే తాజాగా ఆలయం నైట్ వ్యూకి సంబంధించిన ఫొటోలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ (Ram Janmbhoomi Teerth Kshetra Trust) సోషల్ మీడియాలో షేర్ చేససింది. మందిరం ప్రాంగణం రాత్రి సమయంలో ఎలా ఉంటుందో చూపించే చిత్రాలను పంచుకుంది. రాత్రి సమయంలో కూడా ఈ ఆలయం అత్యంత ఆకర్షణీయంగా కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
Ram Janmbhoomi Teerth Kshetra Trust shares pictures of Ram Temple premises as it looks during the night. pic.twitter.com/2RPXVUBebA
— ANI (@ANI) January 8, 2024
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..