New Ration Cards | పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబరు చెప్పింది. త్వరలో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు, హెల్త్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించింది. అది కూడా అక్టోబర్‌లో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు వస్తాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అనంతరం మంత్రి ఉత్తమ్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేబినెట్ సబ్ కమిటీ భేటీలో చర్చించిన విషయాలను విలేఖరులకు వివరించారు.
కొత్త రేషన్ కార్డుల మంజూరు విషయమై విధివిధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెల్ల రేషన్ కార్డు అర్హులు ఎవరనేదానిపై త్వరలో జరగనున్న సమావేశంలో నిర్ణయిస్తామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులను ఎలా మంజూరు చేస్తున్నారనేదానిపై వివరాలు సేకరిస్తున్నామని తెలిపారు. రేషన్ కార్డుల నిబంధనలు ఎలా ఉండాలని పార్టీలకు లేఖలు రాశామని, కొందరు ప్రజాప్రతినిధులు విలువైన సూచనలు అందించారని తెలిపారు. తమకు అందిన సలహాలు, సూచనలన్నీ పరిగణలోకి తీసుకొని వచ్చే సమావేశంలో చర్చిస్తామని వివరించారు.
కాగా రాష్ట్రంలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రేషన్ కార్డుదారులకు ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని తెలిపారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వం 49,000 రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందని తెలిపారు. , అవి కూడా ఉప ఎన్నికలు ఉన్న యోజకవర్గాల్లోనే తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ కార్డులు ఇవ్వలేదని ఆరోపించారు. సెప్టెంబర్ 21న మరోసారి కేబినెట్ సబ్ కమిటీ భేటీ నిర్వహిస్తామని, ఈ నెలాఖరులోగా కేబినెట్ కమిటీ నివేదిక ఇస్తుందని, అక్టోబరులో అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు (New Ration Cards ) అందిస్తామని మంత్రులు వెల్లడించారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..