Kolkatha Rape Murder Case | ఆర్‌జి కర్ ఆసుపత్రి (RG Kar Hospital) అత్యాచారం, హత్య కేసులో నిరసన తెలుపుతున్న జూనియర్ వైద్యుల డిమాండ్ మేరకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్‌ను శుక్రవారం తొలగించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణంగా అత్యాచారం, హత్యకు గురైన ట్రైనీ-డాక్టర్‌కు న్యాయం చేయాలని వైద్యులు డిమాండ్ చేయడంతో వైద్యులతో సమావేశం దాదాపు రెండు గంటల పాటు కొనసాగింది. కోల్‌కతా కొత్త పోలీస్ కమిషనర్ నియామకాన్ని మంగళవారం ప్రకటించే అవకాశం ఉంది. ఉత్తర డిప్యూటీ కమిషనర్‌ను కూడా బదిలీ చేయనున్నట్లు ఆమె తెలిపారు.
జూనియర్ డాక్టర్ల డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోల్‌కతా పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ గోయల్ రాజీనామాకు సిద్ధమని సమావేశంలో తెలిపారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆయన కొత్త పోలీసు కమిషనర్‌కు బాధ్యతలు అప్పగించనున్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌లను కూడా తొలగిస్తామని మమతా బెనర్జీ తెలిపారు.
ఈ సందర్భంగా మీడియాతో మమతా బెనర్జీ మాట్లాడుతూ.. హెల్త్ సర్వీస్ డైరెక్టర్, మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌ను తొలగించాలని నిర్ణయించుకున్నామని.. అలాగే కోల్‌కతా పోలీస్ కొత్త కమిషనర్‌ను మంగళవారం నియమిస్తామన్నారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్ల డిమాండ్లను చీఫ్ సెక్రటరీ నేతృత్వంలోని కమిటీ పరిశీలిస్తుందని మమతా బెనర్జీ తెలిపారు.
తమ ఐదు డిమాండ్లలో మూడింటిని ఆమోదించినందున నిసననను ఉపసంహరించుకోవాలని వైద్యులను కోరినట్లు బెంగాల్ సిఎం తెలిపారు. ఇదిలా ఉండగా కొన్ని అంశాలపై అగ్రిమెంట్లు జరిగాయని, మరికొన్నింటిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆందోళనకు దిగిన వైద్యులు తెలిపారు. 42 మంది ఆందోళన చేస్తున్న వైద్యులు, చీఫ్ సెక్రటరీ మనోజ్ పంత్ ఒప్పందాలపై సంతకం చేశారని మమత తెలిపారు.
మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ , “తమకు నాలుగు డిమాండ్లు ఉన్నాయని.. మొదటిది వారు వైద్య కార్యదర్శితో సహా ముగ్గురి పేర్లను ప్రస్తావించారని అన్నారు. మేము వారి డిమాండ్‌ల మేరకు DME (డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్), DHS (డైరెక్టర్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్)లను తొలగించాలని నిర్ణయించుకున్నాము. సీపీ వినీత్ గోయల్‌ను తొలగించాలని డిమాండ్ చేశారు. మేము దానికి అంగీకరించాము. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత అతనిని తొలగించాలని నిర్ణయించాము. వినీత్ గోయల్ తన బాధ్యతలను కొత్త సీపీకి అప్పగిస్తారు. మేము నార్త్ డిసిని తొలగించాలని కూడా నిర్ణయించుకున్నాం అని తెలిపారు.
“ఇంకేమైనా సమస్యలు ఉంటే పరిష్కరించేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. వైద్యులు)భవిష్యత్తులో ఏదైనా సమస్యను చీఫ్ సెక్రటరీకి ఫిర్యాదుచేయవచ్చు అని మమతా బెనర్జీ తెలిపారు.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..